CM Jagan: జగన్‌ పర్యటన.. జనం పాట్లు

ABN , First Publish Date - 2022-11-21T20:17:58+05:30 IST

సీఎం జగన్‌ (CM Jagan) నరసాపురం పర్యటనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే నరసాపురం పట్టణం (Narasapuram town) , పాలకొల్లు, నరసాపురం రోడ్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో వాహనదారులు రోడ్లపైకి రాలేని పరిస్థితి ఏర్పడింది.

CM Jagan: జగన్‌ పర్యటన.. జనం పాట్లు

నరసాపురం: సీఎం జగన్‌ (CM Jagan) నరసాపురం పర్యటనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే నరసాపురం పట్టణం (Narasapuram town) , పాలకొల్లు, నరసాపురం రోడ్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో వాహనదారులు రోడ్లపైకి రాలేని పరిస్థితి ఏర్పడింది. అడుగడుగునా అంక్షలు పెట్టడంతో బయటకొచ్చిన వాహనదారులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. మొగల్తూరు, పాలకొల్లు (Palakollu)లో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇక సీఎం వచ్చే సమయానికి అరగంట ముందు, తిరిగి వెళ్లే సమయంలో గంట ముందే ప్రధాన రహదార్లులో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

భారీగా జన సమీకరణ

సీఎం సభ జిల్లా నలుమూలల నుంచి జనసమీకరణ చేశారు. నరసాపురం నుంచే కాకుండా పాలకొల్లు, భీమవరం, తణుకు, యలమంచిలీ, అచంట, పోడూరు, రాజోలు, టీపీగూడెం, జంగారెడ్డిగూడెం (Jangareddigudem) నుంచి వివిధ బస్సుల్లో జనాన్ని తీసుకొచ్చారు. దాదాపు 700 బస్సులను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిల్లో జనాన్ని తరలించారు. సభా ప్రాంగణంలోకి ఎక్కువ మందిని అనుమతించకపోవడంతో చాలామంది బయటే నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో చాల మంది తిరిగి వెళ్లి బస్సుల్లో కూర్చొన్నారు. ఉదయమే 8 గంటలకు సభ ప్రాంగణం వద్దకు తీసుకొచ్చి మధ్యాహ్నం 1.30 వరకు ఉంచడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2022-11-21T20:17:59+05:30 IST