తొడలు కొడతాం, రెచ్చగొడతాం అంటే ఊరుకోం: మంత్రి అమర్నాథ్

ABN , First Publish Date - 2022-10-27T15:05:58+05:30 IST

అమరావతి రైతులు హైకోర్టు (High Court)లో వేసిన రిట్ పిటిషన్‌లో 17మంది అధికారులతో పాటు ప్రజా ప్రతినిదులుగా తాము ఉన్నామని...

తొడలు కొడతాం, రెచ్చగొడతాం అంటే ఊరుకోం: మంత్రి అమర్నాథ్

అమరావతి (Amaravati): అమరావతి రైతులు హైకోర్టు (High Court)లో వేసిన రిట్ పిటిషన్‌లో 17మంది అధికారులతో పాటు ప్రజా ప్రతినిదులుగా తాము ఉన్నామని, దీంతో తమ తరపున సీనియర్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకుని తమ ఇంప్లీడ్ వినలన్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) అన్నారు. గురువారం హైకోర్టుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ తమ ప్రాంత ప్రజా ప్రతినిధుల ఆకాంక్షలకు నిలబడతామని, ఆ ప్రాంత ప్రజల వాణిని కోర్టుకు వినిపిస్తామన్నారు. అందుకే ఈ రోజు స్థానిక ప్రజా ప్రతినిధులం కూడా ఇంప్లీడ్ చేయడానికి వచ్చామన్నారు.

మహా పాదయాత్ర (Maha Padayatra)లో 600 మంది రైతులు (Farmers) ఎవరు నడుస్తున్నారన్నది చెప్పాల్సిన బాధ్యత ఉందని, న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్‌ను అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని మంత్రి అమర్నాథ్ అన్నారు. సంఘీభావం అంటే కలిసి నడవడడమా? అని ప్రశ్నించారు. ఈ కేసు విచారణ తిరిగి శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా పడిందన్నారు. రేపు ఇంప్లీడ్‌పై వివరిస్తామన్నారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు తెలపాలని అనునుకుంటున్నామన్నారు. తమ ప్రాంతానికి వచ్చి తొడలు కొడతాం, రెచ్చగొడతాం అంటే చేతులు కట్టుకుని ఉండలేమన్నారు. 3 రాజధానులకు రైతులు ఓకే అంటే వారిని అడుగు కింద పెట్టకుండా తమ బుజాలపై మోసుకొని అరసవల్లి వరకు తీసుకువెళతామని మంత్రి అమర్నాథ్ అన్నారు.

Updated Date - 2022-10-27T15:06:04+05:30 IST