విస్సన్నపేట మండలానికి సాగు, తాగునీరు అందించాలి
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:47 PM
మెట్ట ప్రాంతమైన విస్సన్నపేట మండలానికి తాగు, సాగునీరు అందించాలని సోమవారం తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీడీ పీ మండల నాయకులు, రైతు లు కలిసి కోరారు.

విస్సన్నపేట, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మెట్ట ప్రాంతమైన విస్సన్నపేట మండలానికి తాగు, సాగునీరు అందించాలని సోమవారం తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీడీ పీ మండల నాయకులు, రైతు లు కలిసి కోరారు. కృష్ణా-గోదావరిని అనుసంధానం చేసి వెంకటాపురం వరకు ఆ జలాల ను తీసుకురానున్న నేపథ్యంలో గ్రావిటీ ద్వారా మెట్ట ప్రాంతమైన విస్సన్నపేటకు జలాలు వచ్చేలా చూడాలని కోరారు. చనుబండ పెద్ద చెరువు మీదుగా సప్లయి చానల్ ఏర్పాటు చేయాలని కోరారు. టీడీపీ నేతలు ఎన్టీ వెంకటేశ్వరరావు, గొట్టేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు(బుడ్డయ్య), దమ్మలపాటి సాంబశివరా వు, వీరమాచినేని కృష్ణప్రసాద్, శ్రీనివాసరావు, సాంబశివరావు పాల్గొన్నారు.