Share News

ఈతకని వెళ్లి పాలేటిలో బిహార్‌ యువకుడు గల్లంతు

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:48 PM

స్థానిక సిమెంట్‌ ఫ్యాక్టరీలో కాంట్రాక్టర్‌ కింద పనిచేసేందుకు వచ్చిన యువకుడు పట్టణ పరిధిలోని పాలేటిలో ఈతకని దిగి గల్లంతయ్యాడు.

ఈతకని వెళ్లి పాలేటిలో బిహార్‌ యువకుడు గల్లంతు

జగ్గయ్యపేట, మార్చి 31(ఆంధ్రజ్యోతి): స్థానిక సిమెంట్‌ ఫ్యాక్టరీలో కాంట్రాక్టర్‌ కింద పనిచేసేందుకు వచ్చిన యువకుడు పట్టణ పరిధిలోని పాలేటిలో ఈతకని దిగి గల్లంతయ్యాడు. ఈ ఘటన సోమవారం సాయం త్రం జరిగింది. ఎస్సై జి.రాజు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌కు చెందిన మహ్మద్‌ ఫైజాన్‌(22), మహ్మద్‌ బాషీద్‌ మరికొంతమంది యువకులు జగ్గయ్యపేట సమీపంలో సిమెంట్‌ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్‌ ఏజెన్సీ కింద పనిచేసేందుకు వచ్చారు. రంజాన్‌ పండుగ కావటంతో సరదాగా బయటకు వచ్చిన వారంతా పట్టణ సమీపంలోని అగ్రహారం బ్రిడ్జి వద్ద పాలేటిలో ఈతకు దిగారు. ఫైజాన్‌ నీటిలో మునిగిపోయాడు. మిగిలిన వారంతా రక్షించే ప్రయత్నం చేసినా దొరకలేదు. బాషీద్‌ జగ్గయ్యపేట పోలీసులకు ఫోన్‌ చేసి తెలియజేయడంతో ఎస్సై రాజు ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలిస్తున్నారు. గల్లంతైన ఫైజాన్‌ది బిహార్‌ రాష్ట్రంలోని బేగుశరై జిల్లాలో బడిశంక్‌ గ్రామం. అవివాహతుడని స్నేహితులు తెలిపారు.

Updated Date - Mar 31 , 2025 | 11:48 PM