పీఎం ఉజ్వల్‌ పథకం అమలయ్యేలా అనుమతివ్వండి

ABN , First Publish Date - 2022-08-30T04:34:55+05:30 IST

ప్రధాన మంత్రి ఉజ్వల్‌ పథకం అమలుకు చేయకపోగా, మా ఏరియాలో మీరు భారత్‌ గ్యాస్‌ కనెక్షన్‌లు ఇవ్వకూడదంటూ

పీఎం ఉజ్వల్‌ పథకం అమలయ్యేలా అనుమతివ్వండి
జేసీకి ఫిర్యాదు చేస్తున్న బీజేపీ నాయకులు

పొదలకూరు, ఆగస్టు 29 : ప్రధాన మంత్రి ఉజ్వల్‌ పథకం అమలుకు చేయకపోగా, మా ఏరియాలో మీరు భారత్‌ గ్యాస్‌ కనెక్షన్‌లు ఇవ్వకూడదంటూ ఇండేన్‌ గ్యాస్‌ నిర్వాహకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని పొదలకూరు బీజేపీ మండల అధ్యక్షుడు ముక్కు అయోధ్యరామయ్య, నాయకులు పెంచలయ్య సోమవారం జేసీకి ఫిర్యాదు   చేశారు.  పేదలకు ఉజ్వల్‌ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇండేన్‌ గ్యాస్‌ వారు మా ఏరియాలోకి వచ్చి మీరు వ్యాపారం చేస్తుండడంతో మా వ్యాపారం దెబ్బతింటుందని  అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలిపారు. ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌లు ఇప్పించేలా తగు చర్యలు  తీసుకోవాలని జేసీని కోరినట్లు వారు తెలిపారు.


Updated Date - 2022-08-30T04:34:55+05:30 IST