Chintakayala Vijay: మరోసారి విజయ్ నివాసానికి ఏపీ సీఐడీ... చివరకు అపార్ట్మెంట్ వాసుల దెబ్బకు పరుగో పరుగు..
ABN , First Publish Date - 2022-10-02T00:25:31+05:30 IST
టీడీపీ నేత చింతకాయల విజయ్ (Chintakayala Vijay) నివాసానికి మరోసారి ఏపీ సీఐడీ (AP CID) పోలీసులు వెళ్లారు.

హైదరాబాద్: టీడీపీ నేత చింతకాయల విజయ్ (Chintakayala Vijay) నివాసానికి మరోసారి ఏపీ సీఐడీ (AP CID) పోలీసులు వెళ్లారు. అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్ డిలీట్ చేసేందుకు సీఐడీ యత్నించింది. అయితే సీసీ ఫుటేజ్ డిలీట్ చేయడం కుదరదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పింది. ఏపీ సీఐడీ తీరుపై అపార్ట్మెంట్ వాసులు మండిపడ్డారు. సివిల్ డ్రెస్‌లో వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు అపార్ట్మెంట్ వాసులు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అపార్ట్మెంట్ నుంచి పరుగులు తీశారు. చింతకాయల విజయ్‌కి ఏపీ సీఐడీ నోటీసులిచ్చారు. సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై తప్పుడు ప్రచారం చేశారని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. 'భారతి పే' అని తప్పుడు ప్రచారాన్ని సృష్టించారని, దీని వెనుక ఐటీడీపీ పాత్ర ఉందని తేలిందని తెలిపింది. విజయ్ ఆధ్వర్యంలోనే ఐటీడీపీ నడుస్తోందని సీఐడీ తెలిపింది.
విజయ్ ఇంటికి ఏపీ పోలీసులు రావడం కలకలం రేపింది. విజయ్ ఇంట్లో లేకపోవడంతో సర్వెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు వచ్చారో.. కేసు ఏంటో కూడా పోలీసులు చెప్పలేదు. ఇంట్లో పిల్లలు ఉన్న సమయంలో పోలీసులు రావడం.. అసలు వచ్చింది పోలీసులో కాదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కుటుంబసభ్యులు వాపోయారు. చింతకాయల విజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటారు. ఐటీడీపీ కో కన్వీనర్‌గా ఉన్నారు. ఈ ఐటీడీపీకి సంబంధించి రెండు రోజుల క్రితం ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మార్పింగ్ చేశారని పోలీసుల అభియోగంగా ఉంది.