Share News

విశేషాల వారధి

ABN , Publish Date - Apr 06 , 2025 | 10:53 AM

ఒక దేశంలో నుంచి మరో దేశంలోకి అడుగుపెట్టాలంటే పాస్‌పోర్టు, వీసా, చెకింగ్‌... ఇలా బోలెడు తతంగం ఉంటుంది. అయితే కేవలం ఒక చిన్న వంతెన దాటితే చాలు... పాస్‌పోర్టు అవసరం లేకుండా మరో దేశంలోకి అడుగుపెట్టొచ్చు.

విశేషాల వారధి

రెండు దేశాలను కలిపే అతి చిన్న వంతెన అది. అంతేనా... ఆ వంతెన దాటితే ఆశ్చర్యంగా సమయం కూడా మారిపోతుంది. పోర్చుగల్‌, స్పెయిన్‌లను కలిపే 19 అడుగుల కర్ర వారధి గుండా ప్రయాణిస్తే... పాస్‌పోర్ట్‌, వీసా కూడా అవసరం లేదు. ఈ అతి చిన్న వంతెనకు చాలా చరిత్రే ఉందండోయ్‌...

ఒక దేశంలో నుంచి మరో దేశంలోకి అడుగుపెట్టాలంటే పాస్‌పోర్టు, వీసా, చెకింగ్‌... ఇలా బోలెడు తతంగం ఉంటుంది. అయితే కేవలం ఒక చిన్న వంతెన దాటితే చాలు... పాస్‌పోర్టు అవసరం లేకుండా మరో దేశంలోకి అడుగుపెట్టొచ్చు. ఎంచక్కా సైకిల్‌ లేదా మోటరు బైక్‌పై వెళ్లిపోవచ్చు. అంతెందుకు... నడుచుకుంటూ అలా నాలుగు అడుగులు వేసినా పక్క దేశంలోకి వెళ్లిపోతారు. పోర్చుగల్‌, స్పెయిన్‌ దేశాల మధ్య అబ్రిలోంగో నదిపై ఉందీ ‘ఎల్‌ మార్క్‌’ అనే వంతెన. స్పెయిన్‌ దేశానికి చెందిన చివరి గ్రామం ఎల్‌ మార్క్‌, పోర్చుగల్‌ గ్రామమైన వర్జియా గ్రాండెలను కలుపుతుందీ వంతెన. దీని పొడవు కేవలం 19 అడుగులు, వెడల్పు నాలుగున్నర అడుగులు మాత్రమే. కావునే ప్రపంచంలోనే ‘అతి చిన్న అంతర్జాతీయ వంతెన’గా గుర్తింపు పొందింది.

ఈ వార్తను కూడా చదవండి: Twins Village: ఆ పల్లె ఇంట.. కవలల పంట


టైమ్‌ మారుతుంది...

ఈ అతి చిన్న వంతెనపై నుంచి వెళితే ఒక దేశం నుంచి మరొక దేశంలోకి అడుగు పెట్టడమే కాకుండా ‘టైమ్‌ ట్రావెల్‌’ కూడా చేస్తారు. అదెలాగంటే... పోర్చుగల్‌ గ్రీన్‌విచ్‌ మీన్‌ టైమ్‌(జిఎంటీ)ని ఫాలో అవుతుంది. స్పెయిన్‌ మాత్రం సెంట్రల్‌ యూరోపియన్‌ టైమ్‌ (సిఇటీ)ని అనుసరిస్తుంది. ఈ టైమ్‌జోన్స్‌ని క్రాస్‌ చేయడం వల్ల టెక్నికల్‌గా టైమ్‌ ట్రావెల్‌ చేసిన వారవుతారు. అంటే పోర్చుగల్‌ నుంచి 19 అడుగుల వంతెన దాటి స్పెయిన్‌లోకి ప్రవేశించగానే టెక్నికల్‌గా ఒక గంట ముందుకు వెళ్లిపోతారు. వారధి దాటగానే అందుకు తగ్గట్టుగా గడియారాన్ని సరిచేసుకోవాల్సి ఉంటుంది.

book6.2.jpg


ఇవి రెండు యూరోపియన్‌ దేశాలే. రెండు దేశాల ప్రజలు సులువుగా ప్రయాణించేందుకు వీలుగా చాలా ఏళ్ల క్రితమే ఈ వంతెనను నిర్మించారు. ఒకప్పుడు స్పెయిన్‌, పోర్చుగల్‌ దేశాల మధ్య తనిఖీలు, గస్తీ ఉండేది. అయితే 1996లో జరిగిన ‘స్కెంజెన్‌’ ఒప్పందంలో భాగంగా సరిహద్దు చెక్‌పోస్టును తొలగించారు. అప్పటి నుంచి ఈ వారధికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. సరదాగా ఒకేసారి రెండు దేశాల్లో అడుగుపెట్టిన అనుభూతి ఎల్‌ మార్క్‌ వంతెనపై నుంచి వెళ్తుంటే కలుగుతుంది. కాలువపైన కట్టిన ఈ కర్ర వంతెనపై నిలబడి చాలామంది సరదాగా సెల్ఫీలు దిగుతారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పోస్టల్‌ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!

కేంద్ర పెట్టుబడి సాయం రూ.18 వేలకు పెంచాలి

మెట్రో రైల్‌పై బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం ఆపండి

Read Latest Telangana News and National News

Updated Date - Apr 06 , 2025 | 10:56 AM