AP News: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం: విడదల రజని
ABN , First Publish Date - 2022-09-04T01:21:50+05:30 IST
ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి విడదల

అమరావతి: ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి విడదల రజని (Vidadala Rajini) తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందుకోసం నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు. అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో విలేజీ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ (CM Jagan) ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని పీహెచ్సీలలో వైద్య సిబ్బందిని నియమించి ప్రజలకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైద్యశాలల అభివృద్ధికి అవసరమైన నిధులు త్వరలోనే మంజురు చేస్తామని రజని ప్రకటించారు.