West Godavari: సంక్రాంతికి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లాలనుకునేవాళ్లకు ఈ విషయం తెలుసో..లేదో..!

ABN , First Publish Date - 2022-12-18T13:45:28+05:30 IST

ఈసారి సంక్రాంతికి (Sankranti) కోడి పందేలు (Kodi Pandelu) జరుగుతాయో లేదో గాని ఇప్పటి నుంచే పశ్చిమ గోదావరి జిల్లాలోని (West Godavari District) లాడ్జిలకు విపరీతమైన..

West Godavari: సంక్రాంతికి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లాలనుకునేవాళ్లకు ఈ విషయం తెలుసో..లేదో..!

నరసాపురం: ఈసారి సంక్రాంతికి (Sankranti) కోడి పందేలు (Kodi Pandelu) జరుగుతాయో లేదో గాని ఇప్పటి నుంచే పశ్చిమ గోదావరి జిల్లాలోని (West Godavari District) లాడ్జిలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. కోడి పందేలతో పాటు జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాలను (Sankranti Celebrations) తిలకించేందుకు తెలుగు రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతుంటారు. పండుగ మూడు రోజులు ఈ ప్రాంతంలో సంతోషంగా గడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. వీరితో పాటు పందెం రాయుళ్లు కాయరాజాకాయ్‌ అంటూ ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నారు. వీరంతా అడ్వాన్స్‌గా రూమ్‌లు బుక్‌ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

నరసాపురం (Narsapuram), పాలకొల్లు (Palakollu), భీమవరం (Bhimavaram), తణుకు (Tanuku), టీపీగూడెం (Tadepalligudem) ప్రాంతాల్లోని లాడ్జిలకు ముందుగా డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకు నిర్వాహకులు గదుల ధరల్ని రెట్టింపు చేశారు. సాధారణ రోజుల్లో ఉండే ధరను పెంచేశారు. లాడ్జి స్థాయి బట్టి ధర ఫిక్స్‌ చేశారు. రూ. 3 వేలు ఉండే డీలక్స్‌ రూమ్‌ను రూ.6 వేలు చెబుతున్నారు. సింగల్‌ రూమ్‌ రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచారు. ఫోన్‌ చేసి రూమ్‌ గురించి అడిగితే ధరలు చెప్పి అడ్వాన్స్‌ ఇస్తేనే బుక్‌ చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు. అది కూడా పండుగ మూడు రోజులపాటు రూమ్‌ బుక్‌ చేసుకోవాల్సిం దేనంటున్నారు. ముందుగా మూడు రోజులు బుక్‌ చేసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక రోజైతే మళ్లీ ఫోన్‌ చేయండి చూసి చెబుతామంటూ దాటేస్తున్నారు.

గతంలో లాడ్జిలో దిగి ఉన్న పాత కస్టమర్లకు ఇదే విషయాన్ని చెబుతున్నారు. పండుగ రోజు వర్కర్లు రారు. రెట్టింపు జీతం ఇవ్వాల్సి వస్తుంది. కరెంట్‌, ట్యాక్స్‌లు పెరిగాయి. అందువల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక రోజు దిగి వెళ్లిపోతే.. మిగిలిన రెండు రోజులు గదులు బుక్‌ అవ్వవు. కాబట్టి ఎక్కువ మంది మూడు రోజులు ఉండేందుకు వస్తున్నారు. బేరం పోగొట్టుకోం. మొదటి ప్రాధాన్యం వాళ్ళకే ఇస్తున్నాం. మీరు మూడు రోజులు బుక్‌ చేసుకోండంటూ వ్యాపార శైలిలో చెప్పేస్తున్నారు. ఇప్పటికే సగం గదులు పుల్‌ అయ్యాయని చెప్పడంతో చాలామంది మళ్లీ రూమ్‌ దొరక్కపోతే... ఇబ్బంది పడతామన్న భయంతో అడ్వాన్స్‌లు ఇచ్చి బుక్‌ చేసుకుంటున్నారు. ఇటు కల్యాణ మంపడంలోని గదులు కూడా ఈసారి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

Updated Date - 2022-12-18T14:25:45+05:30 IST