Senior Citizens FD rates: సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులివే..

ABN , First Publish Date - 2022-11-08T20:00:04+05:30 IST

జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముపైనే సీనియర్ సిటిజన్లు (Senior Citizens) ఆధారపడుతుంటారు. తమ డబ్బుపై అధిక వడ్డీని (interest rate) ఆశిస్తుంటారు. ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకుల్లో (Banks) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు(Fixed deposits) మొగ్గుచూపించడానికి కారణం కూడా ఇదే.

Senior Citizens FD rates: సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులివే..

జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముపైనే సీనియర్ సిటిజన్లు (Senior Citizens) ఆధారపడుతుంటారు. తమ డబ్బుపై అధిక వడ్డీని (interest rate) ఆశిస్తుంటారు. ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకుల్లో (Banks) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు(Fixed deposits) మొగ్గుచూపించడానికి కారణం కూడా ఇదే. మరి సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్న బ్యాంకులేవి? ఎంత వడ్డీ రేట్లు అందిస్తున్నాయనే వివరాలు మీరూ తెలుసుకోండి..

ఈ ఏడాది కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) నాలుగుసార్లు రెపో రేటు (Repo rate) పెంచిన నేపథ్యంలో.. తదనుగుణంగా పలు బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంచాయి. ఈ జాబితాలో బంధన్ బ్యాంక్ (Bandhan Bank) కూడా ఉంది. 600 రోజుల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై (FD) వడ్డీ రేటును (Interest rate) 7.5 శాతం నుంచి 8 శాతానికి పెంచినట్టు బ్యాంక్‌బజార్ పోర్టల్ డేటా పేర్కొంది. మూడేళ్ల కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై డీసీబీ బ్యాంక్ (DCB bank), బంధన్ బ్యాంక్ 8 శాతం వడ్డీ రేటుని ఆఫర్ చేస్తున్నాయి.

ప్రైవేటు-సెక్టార్ బ్యాంకుల విషయానికి వస్తే.. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small finance bank) కూడా సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఎఫ్‌డీపై 8 శాతం వడ్డీ రేటుని అందిస్తోంది. అంటే రూ.1 లక్ష మొత్తాన్ని ఎఫ్‌డీ చేస్తే మూడేళ్లలో రూ.1.27 లక్షలకు వృద్ధి చెందుతుంది. ఇతర బ్యాంకుల విషయానికి వస్తే.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Equitas small Finance Bank) సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఎఫ్‌డీపై 7.90 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. అంటే రూ.1 లక్ష మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లలో రూ.1.26 లక్షలకు వృద్ధి చెందుతుంది. ఇక ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank), యస్ బ్యాంక్ (Yes Bank), సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (Suryoday small Finance Bank) మూడేళ్ల ఎఫ్‌డీపై సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ రేటుని ఆఫర్ చేస్తున్నాయి. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union bank of India) మూడేళ్ల ఎఫ్‌డీపై సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అంటే రూ.1 లక్ష మొత్తం మూడేళ్ల ఎఫ్‌డీ చేస్తే రూ.1.24 లక్షలు లభిస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25 శాతం, ఆర్‌బీఎల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు 7.05 శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి.

Updated Date - 2022-11-08T20:38:47+05:30 IST