ED: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కనికారెడ్డిని ప్రశ్నించిన ఈడీ
ABN , First Publish Date - 2022-11-19T18:23:48+05:30 IST
లిక్కర్ స్కామ్ కేసులో కనికారెడ్డి (Kanika Reddy)ని ఈడీ (ED) ప్రశ్నించింది.

ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో కనికారెడ్డి (Kanika Reddy)ని ఈడీ (ED) ప్రశ్నించింది. కనికారెడ్డి విమానాల్లో నగదు తరలించారని అభియోగాలు ఉన్నాయి. దాదాపు గంటకుపైగా కనికారెడ్డిని ప్రశ్నించినట్లు ఈడీ తెలిపింది. జెట్ సెట్ గో ఆపరేషన్స్, కంపెనీ వివరాలను ఈడీ అధికారులకు కనికారెడ్డి అందజేసినట్లు సమాచారం అందింది. కనికారెడ్డిని మరోసారి విచారించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.