OPS: డీఎంకే - అన్నాడీఎంకే అన్నాదమ్ములే

ABN , First Publish Date - 2022-11-09T10:03:45+05:30 IST

డీఎంకే, అన్నాడీఎంకే అన్నాదమ్ములని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం(O. Panneerselvam) అన్నారు. ఆయన మం

OPS: డీఎంకే - అన్నాడీఎంకే అన్నాదమ్ములే

- తిరుచ్చిలో ఓపీఎస్‌

అడయార్‌(చెన్నై), నవంబరు 8: డీఎంకే, అన్నాడీఎంకే అన్నాదమ్ములని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం(O. Panneerselvam) అన్నారు. ఆయన మంగళవారం తిరుచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, డీఎంకే, అన్నాడీఎంకేలు అన్నదమ్ములవంటివారు. కానీ, సిద్ధాంతాలు, విధానాల పరంగా వేర్వేరు బాటల్లో పయనిస్తున్నాయి. ఇందులో తమది ఎంజీఆర్‌ మార్గమన్నారు. అన్నాడీఎంకే అనేది కార్యకర్తల పార్టీ. వారిని నిర్లక్ష్యం చేసే ప్రసేక్తే లేదన్నారు. పార్టీ అంటే చిన్నచిన్న సమస్యలు వస్తుంటాయని, అవి కాలక్రమంలో మాయమైపోతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారని, అవకాశం లభిస్తే ఆయనతో సమావేశమవుతానని తెలిపారు. అదేసమయంలో అన్నాడీఎంకేలోని ఐకమత్యాన్ని బీజేపీ విచ్ఛిన్నం చేయలేదన్నారు.

Updated Date - 2022-11-09T10:05:04+05:30 IST