Qatar: వలస కూలీలను తరలిస్తున్న ఖతార్.. అసలు కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-10-30T16:47:48+05:30 IST

ఫిఫా వరల్డ్ కప్ 2022 (fifa world cup 2022) ఆరంభానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆతిథ్య దేశం ఖతార్ (Qatar) కీలక చర్య తీసుకుంది. సెంట్రల్ దోహాలోని (central Doha) పలు భవనాల్లో నివసించే వలస కార్మికులను (migrant workers) అక్కడి నుంచి ఖాళ్లీ చేయించింది.

Qatar: వలస కూలీలను తరలిస్తున్న ఖతార్.. అసలు కారణం ఇదే..

దోహా: ఫిఫా వరల్డ్ కప్ 2022 (fifa world cup 2022) ఆరంభానికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఆతిథ్య దేశం ఖతార్ (Qatar) కీలక చర్య తీసుకుంది. సెంట్రల్ దోహాలోని (central Doha) పలు భవనాల్లో నివసించే వలస కార్మికులను (migrant workers) అక్కడి నుంచి ఖాళీ చేయించింది. ఫిఫా వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో స్థానిక అధికారులు ఈ నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులను వేరే ప్రాంతానికి తరలించారని స్థానిక నివాసులు, కార్మికులు చెప్పారు. బుధవారం పొద్దుపోయాక మునిసిపల్ అధికారులు, సెక్యూరిటీ గార్డులు మొత్తం 12 బిల్డింగ్స్‌లోని వలస కార్మికులను వేరేచోటుకు తరలించారు. అనంతరం భవనాలకు తాళాలు వేశారని స్థానిక వాసులు చెప్పారు. కాగా ఫిఫా వరల్డ్ కప్ నవంబర్ 20, 2022 నుంచి షురూ కానుంది. ఆ భవనాల్లో నివసించడానికి వీల్లేదని పేర్కొంటూ అధికారులు ముందస్తు నోటిసు కూడా జారీ చేశారు. అయితే తరలించిన వలస కార్మికులు అందరికీ సురక్షితమైన, అవసరమైన బస ఏర్పాట్లు సిద్ధం చేశారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

కాగా కార్మికులను ఖాళ్లీ చేయించిన ప్రాంతం అల్-మన్సౌరా చుట్టూ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం కొన్నేళ్ల వ్యవధిలోనే బాగా అభివృద్ధి చెందింది. వరల్డ్ కప్ ఫ్యాన్స్ ఈ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్లలో బస చేస్తారని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఇక్కడి నుంచి వలస కార్మికులను ఖాళ్లీ చేయించారు. సాధారణంగా ఈ ప్రాంత వీధుల్లో డజన్ల సంఖ్యలో ఎక్స్‌కవేటర్స్ (Excavator) పార్క్ చేసి ఉంటాయి. భవనం నుంచి ఖాళ్లీ చేయించడంతో మూడు రాత్రులు ట్రక్‌లోనే పడుకోవాల్సి వచ్చిందని బంగ్లాదేశ్‌కు చెందిన డ్రైవర్ ఒకతను చెప్పాడు. ఇతర ప్రదేశానికి పంపించినా అక్కడ అందరూ బస చేసేందుకు తగినంత రూమ్‌లు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు

Updated Date - 2022-10-30T17:03:08+05:30 IST