NRI: విమానప్రయాణం ఆలస్యం.. ఇబ్బందుల్లో పడ్డ ప్రయాణికులకు అండగా నిలిచిన తానా

ABN , First Publish Date - 2022-11-25T17:58:13+05:30 IST

అమెరికాలో తెలుగు వారికి నిత్యం అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం తాజాగా మరోసారి తన సేవాతత్పరతను చాటుకుంది.

NRI: విమానప్రయాణం ఆలస్యం.. ఇబ్బందుల్లో పడ్డ ప్రయాణికులకు అండగా నిలిచిన తానా

అమెరికాలో తెలుగువారికి నిత్యం అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా-TANA) తాజాగా మరోసారి తన సేవాతత్పరతను చాటుకుంది. ఇటీవల విమాన ప్రయాణం ఆలస్యం కావడంతో ఇబ్బంది పడ్డ భారతీయులకు తానా సభ్యులు అత్యవసర ప్రాతిపదికన భోజన ఏర్పాట్లు చేశారు. నవంబర్ 22న 12.30 గంటలకు చికాగో(Chicago) నుంచి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. దీంతో..పలువురు భారతీయులు సమీపంలోని హోటల్‌లో బస చేయాల్సి వచ్చింది. అయితే.. వారికి భోజనం ఏర్పాట్లు చేయడం కుదరదని ఎయిర్ ఇండియా.. రాత్రి 7.50 గంటలకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న తానా వెంటనే రంగంలోకి దిగింది. రవి సామినేని, హేమ కానూరు ఆధ్వర్యంలో తానా కేవలం రెండు గంటల్లో ఆహారాన్ని సిద్ధం చేసి హోటల్‌లోని ప్రయాణికులకు అందజేసింది.

1.jpg

Updated Date - 2022-11-25T19:44:01+05:30 IST