ఇద్దరు కాదు.. ముగ్గురు కాదు.. ఇతడికి 10 మంది భార్యలు.. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే..
ABN , First Publish Date - 2022-11-20T12:24:52+05:30 IST
ఇంత మంది భార్యలతో ఈయన ఎలా వేగుతున్నాడో ...
అతడికి ఇద్దరు కాదు ముగ్గరు కాదు ఏకంగా పది మంది భార్యలు. 98 మంది పిల్లలు, ఇక బంధువులు అయితే ఏకంగా 568 మంది. మొత్తం కలిపితే అతడి కుటుంబ సభ్యుల సంఖ్య అక్షరాలా 700కు పైగానే. ఏంటి ఇదంతా నిజమే.. అని ఆశ్చర్యం వేస్తుంది అందరికీ. కానీ నిజమేనండోయ్. వైద్య సదుపాయాలు లేని సమయంలో కొందరైనా బతుకుతారనే ఉద్దేశంతో ఎక్కుమ సంఖ్యలో పిల్లలకు జన్మనిచ్చేవారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 98 మందికి జన్మనిచ్చాడు. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉగాండాలో ముసా అనే వ్యక్తికి 10 మంది భార్యలు. హానీఫా హసద్జీ పెద్ద భార్య కాగా.. చిన్న భార్య పేరు కాకాజీ. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. వీరందరూ ఓకే ఇంట్లో ఉంటారట. ఇంత మంది భార్యలతో ఈయన ఎలా వేగుతున్నాడో అనే ఆలోచన అందరికీ వస్తుంది. కానీ వారందరూ ఎంతో బాగా కలసి మెలసి ఉంటున్నారట. అంతేకాదండోయ్.. మా ఆయన ఇంకొక పెళ్ళి చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అతడి భార్యలు చెబుతున్నారు.
అదేంటి ఎందుకలా అని అడిగితే... ‘మా భర్త పది మందిని పెళ్ళి చేసుకున్నా ప్రతి ఒక్కరిమీద శ్రద్ధ చూపిస్తాడు. అందరినీ ఎంతో బాగా చూసుకుంటాడు. మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకున్నా మాకేంటి సమస్య‘ అని అంటున్నారు. అయితే.. 68 ఏళ్ల ముసా మాత్రం నాకు మళ్ళీ పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చేసుకోను అని చెబుతున్నాడు. అయితే 98 మంది పిల్లలకు జన్మనిచ్చిన మూసాకు.. తన పిల్లలందరి పేర్లు గుర్తులేవట. కానీ వారందరి అవసరాలు తీర్చడంలో మాత్రం శ్రద్ధ చూపిస్తాడట. అందరి కోసం బాత్రూమ్‌లు కట్టించి వారికి అసౌకర్యం లేకుండా చేశారట. ఈయన పిల్లలలో కొందరికి పెళ్ళి అయిపోగా.. మరికొందరు ఇంకా చదువుకుంటున్నారట. పెళ్లి సమయంలో మూసా భార్యలకు ఎదురు కట్నంగా ఆవులను, మేకలను ఇచ్చాడట. అంతేకాదండోయ్.. ముసా చాలా కష్టపడి పైకి వచ్చాడట. అతడిలో నిజాయితీ ఎక్కువగానే ఉందని... ఎవరి పట్లా పక్షపాతం చూపడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతిపెద్ద కుటంబం కలిగిన వ్యక్తిగా మూసా గుర్తింపు పొందాడు. గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించింది వీరి కుటుంబం. ఇదండీ.. ముసా పే...ద్ద... కుటుంబం కథ.