chanakya niti: అలాంటి ప్రవర్తన కుటుంబ సభ్యులను అశాంతిలోకి నెట్టివేస్తుంది!
ABN , First Publish Date - 2022-12-11T06:59:25+05:30 IST
పోరాటంతోనే మనిషి జీవితం అద్భుతంగా మారుతుందనే విషయం మనందరికీ తెలుసు. కానీ మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏ విధంగా కష్టపడాలో మనలో చాలామందికి తెలియదు.

పోరాటంతోనే మనిషి జీవితం అద్భుతంగా మారుతుందనే విషయం మనందరికీ తెలుసు. కానీ మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏ విధంగా కష్టపడాలో మనలో చాలామందికి తెలియదు. ఆచార్య చాణక్యుడు మనిషి తన జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు అవసరమైన మార్గాలను తెలియజెప్పాడు. వీటిని అనుసరించే వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరచుకోవడమే కాకుండా, తన జీవితాన్ని ఆనందమయంగా మార్చుకుంటాడు.
ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి జీవితం కష్టాలమయం అవుతుంది. అతను తన జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేడు. మనిషి ఉన్నదానితో సంతృప్తి చెందాలి. ఎవరినుండి అయినా రుణం తీసుకోకూడదు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల సమక్షంలో చెడుగా ప్రవర్తిస్తే వారు సంతోషకరమైన జీవితానికి దూరమవుతారు. తన తల్లిదండ్రులను గౌరవించని, అబద్ధాలు చెప్పే చిన్నారులు జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేరు. ఇటువంటి ప్రవర్తన కుటుంబంలో సమస్యలను సృష్టిస్తుంది. కుటుంబ సభ్యులంతా అశాంతికి లోనవుతారు. ఈ అంశాలను గుర్తించి మనిషి మంచిగా మెలగాలను ఆచార్య సూచించారు.