Bandla Ganesh: త్రివిక్రమ్‌ని అప్పుడలా.. ఇప్పుడిలా!
ABN , First Publish Date - 2022-11-07T21:25:54+05:30 IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సమయంలో.. ఆ సినిమా కంటే కూడా బండ్ల గణేష్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి (Rana Daggubati) కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సమయంలో.. ఆ సినిమా కంటే కూడా బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో ఒకటి బాగా వైరల్ అయింది. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)ను బండ్ల గణేష్ దుర్భాషలాడుతున్నట్లుగా ఉంది. ఆ ఆడియోపై బండ్ల గణేష్ ముందు నేను కాదని బుకాయించినా.. తర్వాత ఓ ఇంటర్వ్యూలో ‘నేనే’ అని ఒప్పేసుకున్నాడు. ఆ ఆడియోలో.. ‘‘ఇవాళ నీ స్పీచ్ అదిరిపోవాలన్నా..’’ అని పవన్ కల్యాణ్ ఫ్యాన్ అడగగా.. ‘‘నేను ఈ వేడుకకు రావడం లేదు.. నేను వస్తే.. త్రివిక్రమ్ ఎక్కడ డౌన్ అవుతాడోనని.. నన్న రానివ్వకుండా ప్లాన్ చేశాడు’’ అంటూ.. కాస్త పర్సనల్‌గానే బండ్ల ఈ ఆడియోలో మాట్లాడేశాడు. ఆ తర్వాత ఆ వీడియో సోషల్ మీడియాలో లీక్ అవడం, వైరల్ అవడం జరిగిపోయాయి. దీనిపై వివరణ అడిగితే.. ఆ వాయిస్ నాది కాదు అని తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో ‘నేనే అన్నాను.. అందుకు సారీ. కానీ అందులో ఉన్నవన్నీ నేను మాట్లాడలేదు’ అని మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని మీడియా కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు. ఇది జరిగిన ఇన్ని రోజుల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు (Nov 7)ను పురస్కరించుకుని బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు. ‘‘#Trivikram #HappyBirthdayTrivikram ఆలోచించగలిగే మేధస్సు స్పందించగలిగే హృదయం అనుకువతో కూడిన మనసు ఇవన్నీ కలిగి ఉన్న మా మాటల మాంత్రికుడు తివిక్రమ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు.. ‘అప్పుడలా.. ఇప్పుడిలా.. నువ్వు గ్రేటన్నా’, ‘ఊసరవెల్లి గుర్తొస్తుంది అన్నా’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read more