-
-
Home » Prathyekam » deaf and dumb couple meet online and get married abdl spl-NGTS-Prathyekam
-
సోషల్ మీడియాలో సంకేతాలతో ప్రారంభమైన విచిత్ర ప్రేమ.. పెళ్లి పీటల వరకు చేరుకుంది.. ఇరు కుటుంబాలు సంతోషంతో..
ABN , First Publish Date - 2022-05-05T09:48:51+05:30 IST
ఇద్దరూ బధిరులు.. పుట్టినప్పటి నుంచి మాట్లాడలేరు, వినలేరు. కొన్నేళ్ల క్రితం ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది.. ఇద్దరూ వీడియో కాల్స్ చేసుకుని సైగలతో మాట్లాడుకునే వారు.. ఆ క్రమంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు.. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు..

ఇద్దరూ బధిరులు.. పుట్టినప్పటి నుంచి మాట్లాడలేరు, వినలేరు. కొన్నేళ్ల క్రితం ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది.. ఇద్దరూ వీడియో కాల్స్ చేసుకుని సైగలతో మాట్లాడుకునే వారు.. ఆ క్రమంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు.. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు.. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్కు సమీపంలోని థిబ్గావ్కు చెందిన సునీల్ యాదవ్ బధిరుడు. ఐదో తరగతి తర్వాత మూగ-బధిరుల పాఠశాలలో చదువుకున్నాడు. అతడిని ఎవరు పెళ్లి చేసుకుంటారని..అతని తల్లిదండ్రులు బాధపడేవారు. కానీ సోషల్ మీడియా ద్వారా సునీత అనే మరో మూగ బధిర యువతి సునీల్‌కు పరిచయమైంది. ఆ తరువాత ఇద్దరూ వీడియో కాల్స్‌లో సైగల ద్వారా మాట్లాడుకునేవారు. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ క్రమంలో ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు.
ఇరు కుటుంబాల వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో ఏడడుగులు వేశారు. తమ పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయని తాము అనుకోలేదని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని ఇరువురి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.