Egg Dropped from Space: గుడ్డును అంతరిక్షం నుంచి కిందకు పడేశారు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN , First Publish Date - 2022-11-29T11:31:36+05:30 IST

గుడ్డును ఏకంగా అంతరిక్షం నుండి వదిలాడు. అది భూమి మీద ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళి...

Egg Dropped from Space: గుడ్డును అంతరిక్షం నుంచి కిందకు పడేశారు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ఇంట్లో గుడ్లు బయటకు తీస్తున్నప్పుడో, బయటనుండి తెస్తున్నప్పుడో ఒక్కోసారి చెయ్యిజారడం సహజం. అలా చెయ్యిజారినపుడు ఏం జరుగుతుంది?? గుడ్డు కాస్తా పగిలి మనల్ని వెక్కిరిస్తుంది. కేవలం అడుగుల ఎత్తులోనే ఇలా జరిగితే ఇక చాలా ఎత్తు నుండి గుడ్డును జారవిడిచినపుడు అది పగలకుండా ఉంటుందా?? ఎందుకు పగలదు అదేదో చైనా వాళ్ళు యాడ్స్ లో గుడ్డును బెడ్డు మీద వేసి కొట్టినా అది పగలకుండా ఉన్నట్టు చూపుతారు. అలా ఉండటానికి భూమి ఏమీ బెడ్డు కాదు కదా.. అయితే ఒక శాస్త్రవేత్త మాత్రం గుడ్డును ఏకంగా అంతరిక్షం నుండి వదిలాడు. అది భూమి మీద ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళి చూశాడు. అతను చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ అతని ఆలోచన ఏమిటి?? అతను చేసిన ప్రయోగ ఫలితం ఏమిటి అంటే..

నాసాలోనూ, యాపిల్ సంస్థలోనూ గతంలో పనిచేసిన మార్క్ రాబర్ అనే యూట్యూబర్ విభిన్నరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. అందులో భాగంగా అతను కోడిగుడ్డును సాధారణ ఎత్తుకంటే మరింత ఎక్కువ ఎత్తునుండి భుమి మీదకు వేయాలని అనుకున్నాడు. అయితే ఆ గుడ్డు పగిలిపోకుండా దాన్ని భూమి మీద పడేలా చేయాలన్నది అతడి ఆలోచన. దానికి తగ్గట్టుగానే ప్రణాళిక రచించుకున్నాడు. మొదట ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా నుండి కోడిగుడ్డును వదలాలని అనుకున్నాడు. అయితే అతని ఆలోచన మళ్ళీ మారింది. బుర్జ్ ఖలీఫా నుండి ఏకంగా అంతరిక్షం వైపు అతని దృష్టి మళ్ళింది. అనుకున్నదే ఆలస్యం రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు లోటేంటి అన్నట్టు ఇతను తను అనుకోగానే అంతరిక్షం నుండి కోడిగుడ్డును వేయడానికి ఏర్పాట్లు పూర్తిచేసుకున్నాడు.

మొదట కోడిగుడ్డు సేఫ్ గా ఉండటానికి కాంట్రాప్షన్ ను క్రియేట్ చేశారు. ఆ తరువాత దాన్ని పారాచుట్ లో ఉంచి రాకెట్ సహాయంతో అంతరిక్షంలోకి పంపి తను అనుకున్న ఎత్తుకు చేరినతరువాత అక్కడి నుండి దాన్ని భూమి మీదకు వదిలాడు. ఇదంతా సుమారు 26నిమిషాల వీడియోగా చిత్రీకరించి దాన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేయగా ఇప్పటిదాకా 14 మిలియన్ల వివ్స్ వచ్చాయి. భూమి మీదకు వదిలిన కోడిగుడ్డు ఎక్కడ ఉందా.. అని వెతుక్కుంటూ వెళ్లి మరీ చూశాడు. అయితే ఆ గుడ్డు పగిలిపోకుండా ఏమాత్రం పగుళ్లు కూడా రాకుండా ఉండటం గమనార్హం. మొత్తానికి ఏ లక్ష్యంతో అయితే ఈ ప్రయోగం చేశాడో.. ఆ లక్ష్యాన్ని అతడు సాధించాడు. ఆ వీడియో కింద అతడిని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2022-11-29T11:31:39+05:30 IST