Ira khan: నాకు నేనే రాణిలా కనిపించా!
ABN , First Publish Date - 2022-11-29T20:41:33+05:30 IST
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ నిశ్చితార్థం ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్, ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ (Amir khan daughter)కుమార్తె ఐరా ఖాన్ (Ira khan)నిశ్చితార్థం ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్, ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖారేతో జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలంగా డేటింగ్‌లో (Ira Dating)ఉన్నారు. త్వరలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. తాజాగా ఐరా ఖాన్ తన గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘‘నేను అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎందుకో ఓ రోజు అలా అనిపించింది. నన్ను నేను యువరాణిలా ఊహించుకున్నా.. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌తోనైనా.. ఎలాంటి కోణంలోనైనా ఫోటో తీయవచ్చని భావించా. ఆరోజు నాకు నేను చాలా అందంగా కనిపించా’’ అని రాసి లవ్ సింబల్ జతచేసింది. దీనికి నటి రియా చక్రవర్తి ‘బ్యూటీఫుల్’ అంటూ లవ్ ఎమోజీలను జత చేసింది. మరో నటి ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ రోజు మీరు ఎరుపు రంగు డ్రెస్‌లో అందంగా కనిపించారు’ అంటూ రిప్లై ఇచ్చింది.