SuperstarKrishna: ఎన్.టి.ఆర్ కృష్ణల ఫోటో వైరల్, ఎందుకంటే

ABN , First Publish Date - 2022-11-22T12:34:36+05:30 IST

కృష్ణ, ఎన్.టి.ఆర్ ల ఫోటో ఒకటి సాంఘీక మాధ్యమాల్లో వైరల్ గా తిరుగుతోంది. ఇంతకీ విషయం ఏంటి అంటే, తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ రావటానికి దోహద పడిన వాళ్లలో కృష్ణ కూడా ఒకరు

SuperstarKrishna: ఎన్.టి.ఆర్ కృష్ణల ఫోటో వైరల్, ఎందుకంటే
File photo: Krishna, Krishna mother Naga Ratnamma and NTR at the inauguration of Padmalaya Studios

సూపర్ స్టార్ కృష్ణ అభిమాన నటుడు ఎన్.టి.ఆర్ అన్న సంగతి చాల సందర్భాల్లో కృష్ణ గారే చెప్పారు. ఇద్దరి మధ్యలో అప్పుడప్పుడు కొన్ని విభేదాలు వచ్చినా, మళ్ళీ ఎదో సందర్భం లో ఇద్దరూ కలిసి ఆప్యాయంగా మాట్లాడుకునేవారు. అలాంటి కృష్ణ, ఎన్.టి.ఆర్ ల ఫోటో ఒకటి సాంఘీక మాధ్యమాల్లో వైరల్ గా తిరుగుతోంది. ఇంతకీ విషయం ఏంటి అంటే, తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ రావటానికి దోహద పడిన వాళ్లలో కృష్ణ కూడా ఒకరు. అందులో ఒకటి పద్మాలయ స్టూడియోస్ స్థాపించటం. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ ఈ స్టూడియో నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తే, ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసాక, 1983, నవంబర్ 21 న ఈ స్టూడియో ఓపెనింగ్ చేశారు. అప్పుడు కృష్ణ గారి తల్లిగారు నాగరత్నమ్మ గారు కూడా వచ్చారు. ఆమె ఎప్పుడూ ఎన్. టి. రామారావు ను తన పెద్ద కొడుకుగా అభివర్ణిస్తూ ఉండేవారు. ఆలా పద్మాలయ స్టూడియోస్ ప్రారంభం అయింది.

పద్మాలయ స్టూడియోస్ ప్రారంభం అయ్యాక మొదటి సారిగా 'కామ్ యాబ్' అనే హిందీ సినిమా నిర్మించారు. దీనికి దర్శకుడు కె. రాఘవేంద్ర రావు కాగా, జితేంద్ర ఇందులో నాయకుడుగా వేశారు. అప్పటి నటి రాధ హిందీలో ఈ సినిమాతో ఆరంగేంట్రం చేసారు. ఈ సినిమా 'శక్తి' అనే తెలుగు సినిమాకి రీమేక్. కృష్ణ, జయసుధ, రాధ ఇందులో ప్రధాన పాత్రధారులు. ఆ తరువాత ఈ స్టూడియో లో మొట్టమొదటి సారిగా, 'సింహాసనం', 'పాతాళభైరవి' సినిమాల కోసం పెద్ద పెద్ద సెట్స్ వేయడం జరిగింది. ఇంత భారీ సెట్స్ అప్పట్లో ఒక స్టూడియో లో వెయ్యటం మొదటి సారి అని చెప్పుకోవచ్చు. చిత్రపరిశ్రమ నుండి చాలామంది ఈ సెట్స్ చూడటానికి వచ్చేవారు అని చెపుతూ ఉండేవారు. ఆ తరువాత పద్మాలయ స్టూడియోస్ మీద ఎన్నో హిందీ, బెంగాలీ, తమిళ్ మరియు ఇతర భాషల్లో సినిమాలు నిర్మించారు. అదీ ఈ ఫోటో వెనకాల వున్నా కథ! #PadmalayaStudios #SuperstarKrishna #NTR #KrishnaLivesOn

ఎన్.టి.ఆర్

Updated Date - 2022-11-22T12:46:23+05:30 IST