Theri Remake: మెగా ఫ్యాన్స్‌లో భిన్నాభిప్రాయాలు
ABN , First Publish Date - 2022-12-10T20:07:01+05:30 IST
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ‘సాహో’ దర్శకుడు సుజీత్ (Sahoo Sujeeth) కాంబినేషన్లో సినిమా ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో.. అప్పటి నుంచి హరీష్ శంకర్‌పై ఒత్తిడి మొదలైంది. ఎందుకంటే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ‘సాహో’ దర్శకుడు సుజీత్ (Sahoo Sujeeth) కాంబినేషన్లో సినిమా ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో.. అప్పటి నుంచి హరీష్ శంకర్‌పై ఒత్తిడి మొదలైంది. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) తర్వాత.. హరీష్ శంకర్ (Harish Shankar)తో చేయాల్సిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ (Bhavadeeyudu Bhagat Singh) సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సింది. ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) తర్వాత లిస్ట్‌లో ఉన్న ఈ సినిమాని.. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak), ‘హరిహర వీరమల్లు’ సినిమాల కోసం వాయిదా వేశారు. ఈ లోపు హరీష్ శంకర్.. స్క్రిప్ట్ మరింత పకడ్బందీగా చేసేందుకు టైమిచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా సుజీత్ లైన్లోకి రావడంతో.. హరీష్ సినిమా ఏమైందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గోల గోల చేస్తున్నారు. ఎందుకంటే హరీష్ ఇచ్చిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) కిక్ అలాంటిది. అయితే హరీష్‌తో అనుకున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టి.. సేమ్ బ్యానర్లో, సేమ్ దర్శకుడితో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘థేరి’ (Theri) రీమేక్‌ని చేయబోతున్నట్లుగా రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త మోగిపోతోంది. ఆల్రెడీ ‘థేరీ’ చిత్రం తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో అనువాదమైంది. మళ్లీ ఆ సినిమానే రీమేక్ చేయడం ఏమిటని.. ఫ్యాన్స్ ఫైరవడం స్టార్ట్ చేశారు.
ఎందుకంటే.. సేమ్ టు సేమ్ ఇలాగే ‘కాటమరాయుడు’ (Katama Rayudu) సినిమాని పవన్ కల్యాణ్ చేశారు. ఆ సినిమా బాగున్నా కూడా.. అజిత్ (Ajith) తమిళ్లో చేసిన ఆ చిత్రం ‘వీరమ్’ (Veeram)గా తెలుగులోనూ విడుదలైంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘కాటమరాయుడు’ బోల్తా కొట్టింది. మళ్లీ అలాంటి ప్రయత్నమే పవన్ చేస్తున్నాడని భావించి.. ఫ్యాన్స్ వార్ మొదలెట్టారు. అదే టైమ్‌లో హరీష్ శంకర్ కూడా ఓ ఎగ్జయిటింగ్ అప్డేట్ అంటూ ట్వీట్ చేయడంతో.. అది ‘థేరి రీమేక్’ అనుకుని.. #WeDontWantTheriRemake అంటూ ఓ ట్యాగ్‌ని బీభత్సంగా ట్రెండ్ చేశారు. దాదాపు 3 లక్షల మంది అభిమానులు ఈ ట్యాగ్‌ని ట్వీట్ చేయడంతో పాటు.. దర్శకుడు హరీష్ శంకర్‌ని కూడా దూషించడం మొదలెట్టారు. కొందరు అభిమానులైతే.. పవన్ కల్యాణ్ ఆ సినిమా చేస్తే.. సూసైడ్ కూడా చేసుకుంటామని లెటర్స్ పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియా అంతా రచ్చరచ్చగా మారింది. అయితే, కాసేపటికి హరీష్ శంకర్ ‘హరిహర వీరమల్లు’ సెట్స్‌లో ఉన్న పిక్స్ పోస్ట్ చేసి.. ‘థేరి’ కాదనేలా.. వాతావరణాన్ని కాస్త శాంతపరిచే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే జరిగిన రచ్చతో కొందరు అభిమానులు ఈ ‘థేరి’ రీమేక్‌పై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్.. పాలిటిక్స్ అంటూ ఓ లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా నడుస్తున్నప్పుడు.. ఇలాంటి వాటితో ఆయనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని, ఫాస్ట్‌గా పూర్తయ్యే సినిమాలతో.. అటు పొలిటికల్‌గా ఆయనకు టైమ్ ఎక్కువ దొరికే అవకాశం ఉంటుందని కొందరు అభిమానులు అభిప్రాయ పడుతుంటే, అలాంటి సినిమాలు చేసి.. హిట్టవకపోయినా, పొలిటికల్‌గా కూడా అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మరొకందరు ఇలా.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూపై ప్రదీప్ (కూకట్పల్లి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్), సిహెచ్ సురేష్ కుమార్ (చిరంజీవి యువత, రాజమండ్రి), సురేష్ కవిరాయని (సీనియర్ జర్నలిస్ట్) ఏమంటున్నారో.. ఈ కింది వీడియోలో చూడవచ్చు.