Rashmika Mandanna: గుండె పగిలిపోయినట్లు అనిపిస్తోంది

ABN , First Publish Date - 2022-11-09T14:13:11+05:30 IST

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. కన్నడ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ అనంతరం ఇతర సౌత్ చిత్ర పరిశ్రమల్లోకి అడుగుపెట్టి అక్కడ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

Rashmika Mandanna: గుండె పగిలిపోయినట్లు అనిపిస్తోంది
Rashmika Mandanna

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. కన్నడ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ అనంతరం ఇతర సౌత్ చిత్ర పరిశ్రమల్లోకి అడుగుపెట్టి అక్కడ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ తరుణంలోనే ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించి.. ప్రస్తుతం బాలీవుడ్‌ (Bollywood)లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే.. చాలాకాలంగా రష్మికపై సోషల్ మీడియా (Social Media) వేదికగా వివిధ అంశాలపై విమర్శలు వస్తున్నాయి. వాటికి సమాధానంగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ని షేర్ చేసంది.

రష్మిక చేసిన ఆ పోస్టులో.. ‘గత కొన్ని రోజులుగా లేదా వారాలు లేదా నెలలు లేదా కొన్ని సంవత్సరాలుగా రెండు విషయాలు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి నేను సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నిజానికి ఇది కొన్ని సంవత్సరాల క్రితమే చేయాల్సింది.

నేను నా కెరీర్‌ని ప్రారంభించినప్పటి నుంచి చాలామంది నన్ను ద్వేషిస్తున్నారు (Hating). విమర్శలు, నెగటివిటీతో ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎంచుకున్న జీవితానికి ప్రత్యేకత ఉందని నాకు తెలుసు. నేను అందరికీ నచ్చాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ అందరూ ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకోను. నేను మీకు నచ్చలేదంటే దానర్థం.. మీరు నాపై విమర్శలు చేయొచ్చని కాదు.

మిమ్మల్నందరినీ సంతోషపెట్టడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నా పని వల్ల మీరు ఆనందపడితే అదే నాకు చాలు. మిమ్మల్ని గర్వించేలా పని చేయడానికి నా శాయాశక్తుల ప్రయత్నిస్తున్నాను. కానీ.. నేను మాట్లాడని విషయాల గురించి నాపై విమర్శలు చేయడం మాత్రం నన్ను చాలా నిరుత్సాహపరుస్తుంది. అవి విన్నప్పుడు గుండె పగిలిపోయినట్లుగా బాధ కలుగుతోంది.

ఇంటర్వ్యూలలో నేను మాట్లాడిన కొన్ని విషయాలు తప్పుగా రీచ్ అయ్యి.. నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని నేను గుర్తించాను. ఇంటర్నెట్‌లో వచ్చే తప్పుడు కథనాల వల్ల పరిశ్రమలో, అలాగే బయట నాకున్న మంచి సంబంధాలపై ప్రభావం పడుతుంది. సద్విమర్శలను నేను స్వాగతిస్తాను. ఎందుకంటే అవి నన్ను నేను మెరుగుపరచుకోడానికి ఉపయోగపడతాయి. కానీ నీచంగా ప్రతికూలత, ద్వేషం ఏంటి?. చాలా కాలంగా దాన్ని పట్టించుకోకుండా ఉండిపోయాను. కానీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ విషయాన్ని ఎత్తి చూపడం ద్వారా.. నేను ఎవరిపై గెలవడానికి ప్రయత్నించడం లేదు. నాపై వస్తున్న విమర్శల కారణంగా మనిషిగా నాలో ఎటువంటి మార్పు రావాలని కోరుకోవడం లేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. మీ అందరూ నాపై చూపిస్తున్న ప్రేమను నేను గుర్తించి, అంగీకరిస్తున్నాను. మీ నిరంతర ప్రేమ, మద్దతు నన్ను ముందుకు నడిపించింది. అదే బయటకు వచ్చి అందరికీ తెలియజేసే ధైర్యాన్ని నాకు ఇచ్చింది. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై, నేను ఇప్పటివరకు పని చేసిన వ్యక్తులపై, నాకు నచ్చిన వారందరిపై నాకు అభిమానం ఉంది. నేను కష్టపడి పని చేయడంతోపాటు మీకు మంచి జరిగేలా ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను చెప్పినట్లు.. మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. అందరూ దయగా ఉండండి. అందరం అందరికీ మంచి చేసేలా కృషి చేద్దాం. ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.

రష్మిక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ భామ పోస్ట్‌పై స్పందించారు. సక్సెస్ అయినా వారికి ఇలాంటివి సాధారణమని, వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని సూచించారు.

Updated Date - 2022-11-09T14:50:51+05:30 IST