వెలుగులోకి షాకింగ్ విషయాలు.. కప్పే కదా అని టచ్ చేస్తే..

ABN , First Publish Date - 2022-11-25T14:42:24+05:30 IST

కప్పలను ముట్టుకున్నా, వీటి చర్మాన్ని నొక్కినా

వెలుగులోకి షాకింగ్ విషయాలు.. కప్పే కదా అని టచ్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఇంటి బయట అక్కడక్కడా సాయంత్రం అవ్వగానే కప్పలు తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎవరికీ హాని కలిగించని జీవులు అనే అభిప్రాయం అందరిలో ఉంది. అయితే ఇది అన్ని ప్రాంతాలకు వర్తించదు. ఉత్తర అమెరికాలో తాజాగా వెలుగులోకి ఒక విషయం చాలా వైరల్ గా మారింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఉత్తర అమెరికాలో సోనోరన్ అనే జాతి కప్పలు ఉంటాయి. ఇవి సుమారు 7అంగుళాల పొడవు ఉంటాయి. వీటిలో విషాన్ని స్రవించే పరోటినాయిడ్ గ్రంథులు ఉంటాయి. ఈ జాతి కప్పలను ముట్టుకున్నా, వీటి చర్మాన్ని నొక్కినా ఇవి విషాన్ని విడుదల చేస్తాయి. ఈ విషం చాలా ప్రమాదకరమైందట. దీని వల్ల మనుషులకు చాలా అనారోగ్య సమస్యలు కలుగుతాయట. ఉత్తర అమెరికాలోని కొన్ని పార్కుల్లో ఈ తరహా కప్పలు స్వేచ్చగా సంచరిస్తూ ఉంటాయి. అవి ఏమీ చేయవులే అనే కుతూహలం కొద్ది వాటిని ముట్టుకోవడం, నొక్కడం వంటివి చేస్తే అవి విషాన్ని చిమ్ముతాయట. ఈ విషం శరీరం మీద పడినా, పొరపాటున నోట్లోకి పోయినా పరిణామాలు చాలా సీరియస్‌గా ఉంటాయట. కనీసం చర్మం మీద పడి ఆరిపోయినా అది చర్మ రంధ్రాలలోకి ఇంకిపోయి చాలా అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందట. అందుకే ఆ ప్రాంతాలలో కప్పలు తిరుగుతున్న చోట హెచ్చరిక బోర్డ్ లు ఏర్పాటు చేస్తున్నారు పార్క్ నిర్వాహకులు.

ఈ రకం కప్పలలో కళ్ల వెనుక భాగంలో ఉత్పత్తయ్యే స్రావాలు.. క్రమంగా రూపాంతరం చెంది విషంగా మారుతాయట. అందుకే ఈ కప్పల కళ్ళకు దగ్గరగా వెళ్ళకూడదని కూడా నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు. మరొక విస్తుపోయే నిజం ఏమిటంటే.. ఈ కప్పలలో ఉత్పత్తి అయ్యే విషాన్ని కొన్ని రకాల మందుల తయారీలో ఉపయోగిస్తున్నారట. ఈ కారణంగా ఈ జాతి కప్పలు క్రమంగా అంతరించిపోతున్నాయట. ఏది ఏమైనా కప్పే కదా.. ఏం చేస్తుందిలే అనే అలసత్వంతో ఎక్కడైనా ఓ మోస్తరు పరిమాణంలో ఉన్న కప్ప కనబడితే.. దానితో ఆటలు ఆడకపోవడం బెటర్.

Updated Date - 2022-11-25T14:42:26+05:30 IST