‘అవును.. నా ప్రియుడిని చంపేందుకు 2 నెలల్లోనే 10 సార్లు ప్రయత్నించా..’..
ABN , First Publish Date - 2022-11-10T17:08:19+05:30 IST
ప్రేమ పేరుతో మోసం చేయడం, ఎదురు తిరిగితే హత్యలకు తెగబడడం వంటి కేసులు ఎక్కువగా యువకుల మీదే నమోదవుతుంటాయి. కానీ అప్పడప్పుడూ కొందరు యువతులు కూడా ఇలాంటి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తుంటారు. ప్రేమలో ఉన్న యువతులు.. కొన్నిసార్లు..
ప్రేమ పేరుతో మోసం చేయడం, ఎదురు తిరిగితే హత్యలకు తెగబడడం వంటి కేసులు ఎక్కువగా యువకుల మీదే నమోదవుతుంటాయి. కానీ అప్పడప్పుడూ కొందరు యువతులు కూడా ఇలాంటి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తుంటారు. ప్రేమలో ఉన్న యువతులు.. కొన్నిసార్లు ఉన్నట్టుండి మనసు మార్చుకుంటుంటారు. ఇలాంటి కేసుల గురించి గతంలో చాలా సార్లు విన్నాం. ప్రస్తుతం మనం చెప్పుబోయే ఘటన కూడా ఇలాంటిదే. ‘‘అవును. నా ప్రియుడిని చంపేందుకు 2నెలల్లో పదిసార్లు ప్రయత్నించా’’.. అంటూ యువతి సంచలన నిజాలు బయటపెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కేరళలోని తిరువనంతపూర్ (Kerala Thiruvananthapuram) జిల్లా పరసాలకు చెందిన షారాన్ అనే యువకుడు, గ్రీష్మా అనే యువతి.. ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకు యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఇంట్లో వారికి తెలీకుండా ఇద్దరూ ఓ రోజు చర్చికి వెళ్లి వివాహం (love marriage) చేసుకున్నారు. కొన్ని నెలలు బాగానే ఉన్నారు. అయితే ఫిబ్రవరిలో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. అదే సమయంలో యువతి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారు. యువతికి కూడా అతడు నచ్చడంతో.. ఎలాగైనా ప్రియుడి అడ్డు తొలగించుకోవాలని అనుకుంది.
ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను ప్రియుడి మొబైల్ నుంచి డిలీట్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే అందుకు ప్రియుడు అంగీకరించలేదు. పైగా తనతోనే ఉండాలంటూ కండీషన్ పెట్టాడు. దీంతో చివరకు అతన్ని అంతమొందించాలని కుట్ర పన్నింది. రెండు నెలల్లో సుమారు పది సార్లు అతడిని చంపేందుకు ప్రయత్నించింది. అయినా అవి ఫలించలేదు. చివరగా అక్టోబర్ 14న మామిడి రసంలో విషం కలిపి ప్రియుడికి ఇచ్చింది. ఇది తాగిన అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అక్టోబర్ 25న మృతి చెందాడు. ఇటీవల పోలీసుల ఎదుట యువతి తన నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యువతి తన ప్రియుడికి మామిడి రసం ఇచ్చే వీడియో... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా ఇంట్లో చేసిన నిర్వాకం.. సడన్గా..f