FIFA World Cup: క్రీడాభిమానులకు కోపం తెప్పించిన జియో.. నెటింట మీమ్స్‌ల వరద!

ABN , First Publish Date - 2022-11-21T11:43:33+05:30 IST

జియో భారతీయ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరచింది. మ్యాచ్ స్ట్రీమింగ్ సమయంలో బఫరింగ్ ఇష్యూస్ తలెత్తడంతో.. క్రీడాభిమానులు సహనం కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే..

FIFA World Cup: క్రీడాభిమానులకు కోపం తెప్పించిన జియో.. నెటింట మీమ్స్‌ల వరద!

ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ ప్రపంచ కప్.. ఇది ఏటా క్రికెట్‌లో వచ్చే వన్డే, టీ20 ప్రపంచకప్ లాంటిది కాదు. నాలుగేళ్లకోసారి వచ్చే సాకర్ సంబరం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని టీవీలు, ఫోన్లకు అతుక్కుపోయేలా చేసే అద్భుత పోరాటం. ఖతర్ వేదికగా ఆదివారం నాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైపోయింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానుల్లానే.. భారతీయులూ రెడీ అయిపోయారు. మ్యాచ్‌ను లైవ్‌లో తిలకించేందుకు JioCinemaను ఓపెన్ చేశారు. కానీ జియో భారతీయ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరచింది. మ్యాచ్ స్ట్రీమింగ్ సమయంలో బఫరింగ్ ఇష్యూస్ తలెత్తడంతో.. క్రీడాభిమానులు సహనం కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా జియోపై ఆగ్రహం వ్యక్తం మీమ్స్ వార్ స్టార్ట్ చేశారు.

JioCinemaలో ఫిఫా వరల్డ్ కప్ చూస్తుంటే.. మైగ్రేషన్, హైపర్ టెన్షన్, స్ట్రెస్ ఈ మూడు ఒకేసారి వచ్చాయని కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తే... ‘కేవలం ఫీఫా వరల్డ్‌కప్‌ను చూసేందుకే రూ.600 పెట్టి వూట్(Voot) సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. కానీ JioCinema నాకు భయకర అనుభూతిని ఇచ్చింది’ అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొందరు యూజర్లైతే.. ‘నెట్‌ఫ్లిక్స్, Google, స్టీమ్ వంటి సంస్థలు సర్వర్లు హ్యాంగ్ అవ్వకుండా అత్యాధునిక పద్ధతులు ఉపయోగిస్తూంటే.. JioCinema మాత్రం.. ఫ్యాన్‌లో సర్వర్‌లను నడిపిస్తోంది’ అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో యూజర్ల ఆగ్రహ జ్వాలలు జియోకు తగిలాయి.

దీంతో వెంటనే స్పందించింది. యూజర్ల దారిలోనే ఓ టిక్‌టాక్ వీడియోను పోస్ట్ చేసి మరీ.. బఫరింగ్ సమస్యలను నివారించడానికి తమ టీమ్ ఎంత కష్టపడిందన్న విషయాన్ని వివరించింది. ‘డియర్ JioCinema ఫ్యాన్స్.. మీకు కలిగిన సౌకర్యానికి మమ్మల్ని క్షమించండి. మీకు గొప్ప అనుభూతి ఇవ్వడానికి మేము నిర్విరామంగా కృషి చేస్తున్నాం. అయితే ఎటవంటి బఫరింగ్ ఇష్యూస్ లేకుండా మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాలంటే.. దయచేసి మీ JioCinema యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొంది.

Updated Date - 2022-11-21T12:30:02+05:30 IST