DAV స్కూల్ రీఓపెన్కు అధికారుల హామీ

ABN , First Publish Date - 2022-10-26T16:34:14+05:30 IST

విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనతో DAV స్కూల్‌ పేరెంట్స్‌, యాజమాన్యం భేటీ అయ్యారు. పేరెంట్స్‌ ప్రధానంగా లేవనెత్తుతున్న 3 డిమాండ్లపై చర్చ జరిగింది.

DAV స్కూల్ రీఓపెన్కు అధికారుల హామీ

హైదరాబాద్‌: విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనతో DAV స్కూల్‌ పేరెంట్స్‌, యాజమాన్యం భేటీ అయ్యారు. పేరెంట్స్‌ ప్రధానంగా లేవనెత్తుతున్న 3 డిమాండ్లపై చర్చ జరిగింది. DAV స్కూల్‌ను రీ ఓపెన్ చేయాలని పేరెంట్స్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డీఈవోకు DAV స్కూల్‌ పేరెంట్స్‌ వినతిపత్రాలు అందజేశారు. గుర్తింపు రద్దును వెనక్కి తీసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అలాగే భద్రతా చర్యలు తీసుకుంటామని DAV స్కూల్‌ మేనేజ్‌మెంట్ హామీ ఇచ్చింది. వారంరోజుల్లో DAV స్కూల్ రీఓపెన్కు అధికారుల హామీ ఇచ్చారు. విద్యాశాఖ కమిషనర్కు అన్ని విషయాలు తెలియజేశామని తల్లిదండ్రులు వెల్లడించారు. తమ విన్నపం పట్ల కమిషనర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. వారం రోజుల్లో పాఠశాల ప్రారంభమవుతుందని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.

Updated Date - 2022-10-26T16:34:16+05:30 IST