తమిళనాడు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా గోపాల్‌

ABN , First Publish Date - 2022-12-28T00:32:46+05:30 IST

శాలిగౌరారం గ్రామానికి చెంది న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి డాక్ట ర్‌ కూతాటి గోపాల్‌ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్ర టరీ పదోన్నతి పొందారు. 1992 ఐ ఏఎస్‌ బ్యాచకు చెందిన గోపాల్‌ ప్ర భుత్వశాఖలో వివిధ హోదాల్లో విశి ష్ట సేవలందించారు.

తమిళనాడు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా గోపాల్‌
సీఎం స్టాలినకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న డాక్టర్‌ గోపాల్‌

తమిళనాడు ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా గోపాల్‌

శాలిగౌరారం, డిసెంబరు 27: శాలిగౌరారం గ్రామానికి చెంది న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి డాక్ట ర్‌ కూతాటి గోపాల్‌ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్ర టరీ పదోన్నతి పొందారు. 1992 ఐ ఏఎస్‌ బ్యాచకు చెందిన గోపాల్‌ ప్ర భుత్వశాఖలో వివిధ హోదాల్లో విశి ష్ట సేవలందించారు. ప్రస్తుతం ఆ యన తమిళనాడు ప్రభుత్వంలో ట్రాన్సపోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తాజాగా స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పదోన్నతి పొందాడు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలినను మంగళవారం చెన్నైలోని సచివాలయంలో గోపాల్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగు చ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా స్టాలిన గోపాల్‌ను అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్‌ గోపాల్‌ పేదరికంలో పుట్టి కష్టపడి చదివి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పదోన్నతి పొందడాన్ని పలువురు అభినందించారు.

Updated Date - 2022-12-28T00:32:48+05:30 IST