కొనసాగిన తీన్మార్‌ మల్లన్న యాత్ర

ABN , First Publish Date - 2022-11-29T23:21:42+05:30 IST

అవినీతిపై పోరుతో తీన్మార్‌ మల్లన్న చేపట్టిన పాదయాత్ర మంగళవారం అన్నపురెడ్డిపల్లిలో కొనసాగింది.

కొనసాగిన తీన్మార్‌ మల్లన్న యాత్ర
విలేకరులతో మాట్లాడుతున్న మల్లన్న

అన్నపురెడ్డిపల్లి, నవంబర్‌ 29: అవినీతిపై పోరుతో తీన్మార్‌ మల్లన్న చేపట్టిన పాదయాత్ర మంగళవారం అన్నపురెడ్డిపల్లిలో కొనసాగింది. సోమవారం రాత్రి అన్నపురెడ్డిపల్లి శివాలయంలో బస్సచేసిన మల్లన్న అన్నపురెడ్డిపల్లి, వెంకటాపురం గ్రామాల మీదగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ 7200 మంది ప్రజాప్రతినిధులు అవనీతి పరులు ఉన్నారని వారిని రీకాల్‌ చేయాలన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేయాలని, పేదల నుంచి సంపన్నుల పిల్లలు ప్రభుత్వ పాఠశాల్లోనే చదవాలన్నారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు పోతున్నట్లు తనకు సమాచారం ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకొని బుధవారం సత్తుపల్లిలో తన అనుచరులతో అత్వవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అవినీ తిపరులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటి పరిష్కారానికి చ ర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పాదయాత్రలో మండలంలోని మల్లన్న అనుచరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-29T23:21:55+05:30 IST