రుద్రారం గణేష్ ఆలయాన్ని దర్శించుకున్న కలెక్టర్
ABN , First Publish Date - 2022-01-02T05:23:19+05:30 IST
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రుద్రారం గణేష్ ఆలయాన్ని కలెక్టర్ హన్మంతరావు శనివారం తన సతీమణి స్రవంతితో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

పటాన్‌చెరు రూరల్, జనవరి 1 : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రుద్రారం గణేష్ ఆలయాన్ని కలెక్టర్ హన్మంతరావు శనివారం తన సతీమణి స్రవంతితో కలిసి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటి ప్రకృతి పరిరక్షణపై తమ అభిమతం చాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆలయ అధికారులు, కమిటీ సభ్యులతో ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి పలు సూచనలిచ్చారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి దంపతులు కూడా గణేష్ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే, కలెక్టర్ దంపతులను సన్మానించారు. కార్పొరేటర్ మెట్టు కుమార్‌యాదవ్, రుద్రారం సర్పంచ్ సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, దశరథరెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. కాగా చిట్కుల్ సర్పంచ్ నీలం మధుముదిరాజ్, ఇస్నాపూర్ సర్పంచ్ బాలమణి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.