టీఆర్‌ఎ్‌సకు ప్రదీ్‌పరావు రాజీనామా
ABN , First Publish Date - 2022-08-08T09:01:41+05:30 IST
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, టీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.

రెండు సార్లు టికెట్ ఇస్తానని ఇవ్వలేదు: ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు
వరంగల్ టౌన్, ఆగస్టు 7: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, టీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను ఈ రోజు టీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేస్తున్నా.. నా శ్రమ, కృషి లేకుండానే తూర్పు నియోజకవర్గంలో గెలిచానని చెప్పుకుంటున్న వారు ఈనెల 10లోపు రాజీనామా చేస్తే ఇద్దరం ప్రజల్లోకి వెళ్తాం. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా.. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా’ అని సవాల్ విసిరారు. 2014 ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ అధిష్ఠానం కొండా సురేఖకు ఇచ్చిందని, 2018లో టికెట్ ఇస్తామని చెప్పి నరేందర్‌కు ఇచ్చిందన్నారు. స్వయంగా కేసీఆర్, కేటీఆర్ ఎమ్మెల్సీ చేస్తామని మభ్యపెట్టి, మాట తప్పారని వాపోయారు. 2016, 2021లలో గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమ వాళ్లకు కనీసం కార్పొరేటర్ టికెట్లు కూడా ఇవ్వలేదన్నారు. తనను, తన వాళ్లను ఆదరించి, అవకాశాలిస్తామనే పార్టీలోనే చేరుతామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, పార్టీ ఏదైనా పోటీ మాత్రం ఖాయమన్నారు.