AE: ఏసీబీకి దొరికిన విద్యుత్ శాఖ ఏఈ
ABN , Publish Date - Mar 28 , 2025 | 04:58 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేటకు చెందిన ప్రసాద్.. 11కేవీ విద్యుత్ లైన్‌ను పక్కకు మార్చడానికి దుండిగల్ మునిసిపాలిటీలోని దొమ్మర పోచంపల్లి సబ్‌స్టేషన్ ఏఈ సురేందర్‌రెడ్డిని సంప్రదించారు.

11కేవీ లైన్‌ను తరలించేందుకు లంచం డిమాండ్
దుండిగల్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : పని జరగాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఏఈ ఏసీబీకి చిక్కాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేటకు చెందిన ప్రసాద్.. 11కేవీ విద్యుత్ లైన్‌ను పక్కకు మార్చడానికి దుండిగల్ మునిసిపాలిటీలోని దొమ్మర పోచంపల్లి సబ్‌స్టేషన్ ఏఈ సురేందర్‌రెడ్డిని సంప్రదించారు. అయితే ఏఈ డబ్బులు డిమాండ్ చేయడంతో ప్రసాద్.. ఏసీబీని ఆశ్రయించారు. అధికారుల సూచన ప్రకారం గురువారం మధ్యాహ్నం సబ్ స్టేషన్‌లో సురేందర్‌రెడ్డికి రూ.30 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ పట్టుకున్నారు. కాగా, ప్రసాద్ గతంలో ఇదే సబ్ స్టేషన్‌లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశారు. ఆ తర్వాత పని మానేసి అదే ప్రాంతంలో విద్యుత్ కాంట్రాక్టర్‌గా మారారు.