అట్టహాసంగా రేవంత్‌ రెడ్డి జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-11-08T23:36:08+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి.

అట్టహాసంగా రేవంత్‌ రెడ్డి జన్మదిన వేడుకలు
ఆమనగల్లు: వేడుకల్లో మండ్లీ రాములు, నాయకులు

ఆమనగల్లు/కడ్తాల్‌/తలకొండపల్లి/మాడ్గుల/ఇబ్రహీంపట్నం, నవంబరు 8: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం అట్టహాసంగా జరిగాయి. ఆమనగల్లు, కడ్తాల్‌, తలకొండపల్లి మండలాల్లో పార్టీ మండల అధ్యక్షులు మండ్లీ రాములు, యాట నర్సింహ, గుజ్జల మహేశ్‌ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడ్తాలలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బీక్యనాయక్‌, రేవంత్‌ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు అసీ్‌ఫఅలీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయా చోట్ల కేక్‌లు కట్‌ చేసి ప్రజలకు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి రేవంత్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. కడ్తాల మండలం రావిచెడ్‌లో సర్పంచ్‌ భారతమ్మ విఠలయ్యగౌడ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు జనార్ధన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో రోడ్‌షో నిర్వహించి కేక్‌కట్‌ చేశారు. ఆయా కార్యక్రమాల్లో చేగూరి వెంకటేశ్‌, గురిగళ్ల లక్ష్మయ్య, మల్లేశ్‌గౌడ్‌, బీచ్యనాయక్‌, పూల శంకర్‌, శ్రీకాంత్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మాడ్గుల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అనుమా్‌సపల్లి ఉపసర్పంచ్‌ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద రేవంతన్న యువసైన్యం ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేశారు. పండ్లు పంచిపెట్టారు. టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అన్నేపాక జంగయ్య, మక్తాల కృష్ణయ్య, అంజయ్య, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం అంబేడ్కర్‌ చౌరస్తాలో టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి చిలుక మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు కేక్‌ కట్‌చేసి, టపాసులు పేల్చి వేడుకను జరిపారు. జడ్పీటీసీ భూపతిగల్ల మహిపాల్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కె.గురునాథ్‌రెడ్డి, పండాల శంకర్‌గౌడ్‌లు వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు సునీతా వెంకట్‌రెడ్డి, ఆకుల మమత నందు, శంకరయ్య, మోహన్‌ నాయక్‌, పార్టీ మండల అధ్యక్షుడు జడల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T23:36:09+05:30 IST