హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు హేయం
ABN , First Publish Date - 2022-12-31T00:14:30+05:30 IST
హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమని, అలాంటి వ్యాఖ్యలు చేసిన నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరే్‌షపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి అన్నారు.

ప్రజాప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప స్వాములు
నిందితుడు నరేష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్
అయ్యప్పస్వాములు, హిందూ సంఘాలు, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసనలు , నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు
కారాబాద్/తాండూరు/పరిగి/కొడంగల్/ధారూరు/బొంరాస్‌పేట్/దోమ/నవాబుపేట/కులకచర్ల/మోమిన్‌పేట్/పూడూరు/ఘట్‌కేసర్ రూరల్/మేడ్చల్ డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమని, అలాంటి వ్యాఖ్యలు చేసిన నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరే్‌షపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలో హిందూ సంఘం నాయకులు, అయ్యప్ప స్వాములు నరేష్ వ్యాఖ్యాలకు నిరసనగా ధర్నా నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి జన్మ రహస్యంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన నరే్‌షను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాల నాయకులు బీజేపీ నాయకులు అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా నరే్‌షపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు ధారూరు పోలీసులకు పిర్యాదు చేశారు. నాయకులు ఎం.రమేశ్, క్రిష్ణ, మహేష్, తదితరులున్నారు. అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నరే్‌షను వెంటనే అరెస్టు చేయాలని తాండూరు పట్టణంలో తాండూరు పట్టణంలో అయ్యప్పస్వామి భక్తులు మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. అయ్యప్ప దేవాలయం నుంచి ఇందిరాచౌక్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం తాండూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేఽశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళికృష్ణాగౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, నాయకులు డాక్టర్ సంపత్, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింహులు, తదితరులు సంఘీభావం తెలిపారు. నరేష్ వ్యాఖ్యలను జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, కౌన్సిలర్ ప్రభాకర్‌గౌడ్, కౌన్సిలర్ వరాల శ్రీనివా్‌సరెడ్డి తదితరులు ఖండించారు. అలాగే నరే్‌షను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పరిగిలో హిందువులు, అయ్యప్పస్వాములు నిరసన ర్యాలీని నిర్వహించి ఎస్‌ఐ విఠల్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి వి.పెంటయ్య, అయ్యప్పభక్తుల కమిటీ సభ్యులు జి.లక్ష్మణ్‌లు మాట్లాడుతూ నరే్‌షపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. పెద్దేముల్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పలువురు గ్రామస్తులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. కులకచర్లలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్వాములు, హిందువులు నిరసన కార్యక్రమం చేపట్టి పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. అయ్యప్పసేవా సమితి కన్వీనర్ వెంకట్‌రాంరెడ్డి, పీరంపల్లి రాజు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు, బీజేపీ మండలాధ్యక్షుడు మహిపాల్, అయ్యప్ప స్వాములు సోమలింగం, గోవర్ధన్‌రెడ్డి, సత్యయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన నరేశ్‌ను వెంటనే అరెస్టు చేయాలని కొడంగల్‌లో బీజేపీ, హిందు వాహిని, అయ్యప్పసేవా సమితి సభ్యులు, స్వాములు ర్యాలీతో అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌పై చట్టరీత్యా చర్యలతో పీడీ యాక్టు కేసు నమోదు చేయాలనే డిమాండ్‌తో ఆందోళన నిర్వహించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈక్రమంలో కొడంగల్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం అటు వైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డికి వారు వినతి పత్రం అందించారు. అలాగే రావుల్‌పల్లిలో అయ్యప్పస్వాములు, హిందు వాహిని, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున బీజాపూర్-హైదరాబాద్ రహదారిపై ఆందోళన వ్యక్తం చేశారు. కొడంగల్‌సీఐ బీ.శంకర్, ఎస్సై రవి పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళనను విరమింపజేశారు. కొడంగల్‌లో అయ్యప్పస్వాములు, హిందు వాహిని, బీజేపీ నాయకులు అందించిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఏ.రవి తెలిపారు. బొంరా్‌సపేట్ మండల కేంద్రంలో హరిహర ధర్మశాస్త్ర సన్నిధానం మండల శాఖ ఆధ్వర్యంలో నరేశ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని ఎస్సై నయిముద్దీన్‌కు వినతి పత్రం అందించారు. దోమ మండల కేంద్రంలో హిందు సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నవాబుపేట మండల కేంద్రంలో అయ్యప్పస్వాములు నరేశ్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేసి ఎస్సై భరత్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. మోమిన్‌పేట్ మండల కేంద్రంలో అయ్యప్పస్వాములు ఆందోళన చేసి ఏఎస్సై జయప్రకాశ్‌కు వినతిపత్రం అందించారు. పూడూరు మండలం చన్‌గోముల్‌లో హిందు సంఘాల ఆధ్వర్యంలో నరేశ్‌పై పీడీ యాక్టు నమోదు చేయాలని పోలీసులకు వినతి పత్రం అందించారు. అలాగే మర్పల్లిలో అయ్యప్ప స్వాములు, బీజేపీ నాయకులు డిమాండ్ తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నరే్‌షను శిక్షించాలని పోలీ్‌సలకు వినతి పత్రం అందజేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, అయ్యప్పస్వాములు గణేష్, సర్వేశ్, శ్రీకాంత్, చింటు, తదితరులున్నారు. కాగా, నరే్‌షను అరెస్ట్ చేయాలని తాండూరు మండల కరన్‌కోట్, తదితర గ్రామాల అయ్యప్ప భక్తులు డిమాండ్ చేశారు. తాండూరు మండలం గౌతాపూర్ చౌరస్తాలో కరన్‌కోట్ మణికంఠ ఆశ్రమం అయ్యప్పస్వామి బాలేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కరన్‌కోట్ ఎస్‌ఐ మఽధుసూదనరెడ్డి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జగ్గయ్యగౌడ్, అశోక్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రోహిత్‌అన్న యువసేనా ప్రతినిధులు సుధాకర్‌గౌడ్, తదిత రులున్నారు. కాగా, మేడ్చల్‌లో అయ్యప్పస్వాములు నరే్‌షపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు మేడ్చల్ హౌజింగ్‌బోర్డులోని అయ్యప్ప ఆలయం నుంచి ర్యాలీకి పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని సీఐ రాజశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అయ్యప్పస్వాములు నారెడ్డి నందారెడ్డి, కృష్ణమూర్తి పంతులు, ప్రశాంత్ పంతులు, నరసింహ్మస్వామి, అనిల్, శ్రీనివాస్, శంకర్‌ముదిరాజ్, సురేష్, వెంకట్రాంరెడ్డి గురుస్వామి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, బీజేపీ ఘట్‌కేసర్ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌రావు, అయ్యప్పమాలదారులు ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్‌లో నరే్‌షపై ఫిర్యాదు చేశారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ ఆశోక్‌రెడ్డిని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండ్ల రామతీర్థ, అయ్యప్పస్వాములు బర్ల ఆంజనేయులు, కట్ట ఆంజనేయులు, నరేష్, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.