టీఆర్ఎస్‌లోకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి?
ABN , First Publish Date - 2022-02-19T02:39:56+05:30 IST
టీఆర్ఎస్‌లోకి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి?

హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలు, అనుచరులతో జగ్గారెడ్డి రహస్య సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. తనను టీఆర్ఎస్ కోవర్ట్ అంటూ ప్రచారం చేయడంపై జగ్గారెడ్డి మనస్తాపం చెందారు. శనివారం రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై జగ్గారెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. జగ్గారెడ్డి సొంత పార్టీ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.