కొత్త విమానంలో కవిత పారిపోవాల్సిందే..: బీజేపీ

ABN , First Publish Date - 2022-11-18T23:21:18+05:30 IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొ త్తగా కొనుక్కున్న విమానంలో పారిపోవాల్సి వస్తుందనే భ యంతోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరా ములు ఎద్దేవా చేశారు.

కొత్త విమానంలో కవిత పారిపోవాల్సిందే..: బీజేపీ
రాయపర్తిలో మాట్లాడుతున్న రాకేష్‌రెడ్డి

రాయపర్తి, నవంబరు 18 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొ త్తగా కొనుక్కున్న విమానంలో పారిపోవాల్సి వస్తుందనే భ యంతోనే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటిపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరా ములు ఎద్దేవా చేశారు. శుక్రవారం రాయపర్తి మండలకేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపీ అర వింద్‌ ఇంటిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళలు ఉన్నప్పుడు కొంత మంది గూండాలు చొరబడి ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడం పోలీసుల కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రం లో శాంతి భద్రతలు క్షీణించాయని, డీజీపీ దీనికి బాధ్యుడ న్నారు. లిక్కర్‌ స్కాంలో అడ్డంగా బుక్కైన చరిత్ర టీఆర్‌ఎస్‌ దన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఆరిపోయే స్థితిలో ఉందని, అం దుకే బీఆర్‌ఎస్‌గా మార్చినప్పటి నుంచి కేసీఆర్‌ ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. సమావేశంలో జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌రెడ్డి, బీజెవైఎం మండల అధ్య క్షుడు రాపాక ప్రశాంత్‌, ఉపాధ్యక్షుడు కొలుకొండా ప్రశాంత్‌, కార్యదర్శి కొమ్ము ప్రకాష్‌, నాయకులు మహేందర్‌, రఘుప తి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-18T23:21:21+05:30 IST