Vijayashanti: కేసీఆర్ పాలనలో సర్పంచులకు ఎందుకీ దుస్థితి..

ABN , First Publish Date - 2022-11-26T22:00:56+05:30 IST

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమే కారణం. దీంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మరోవైపు గ్రామాల్లో అభివృద్ధి పనులు

Vijayashanti: కేసీఆర్ పాలనలో సర్పంచులకు ఎందుకీ దుస్థితి..

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమే కారణం. దీంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మరోవైపు గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడడంతో గ్రామస్థులు సర్పంచ్‌లను నిలదీసున్నారు. టీఆర్‌ఎస్ (TRS) పాలనలో సర్పంచులు పడుతున్న ఇబ్బందులపై బీజేపీ(BJP) నాయకురాలు విజయశాంతి స్పందించారు. వెంటనే బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాలో విజయశాంతి పోస్టు యథాతథంగా..

‘‘కేసీఆర్ స‌ర్కార్ పాల‌న‌లో సబండ వ‌ర్గాలు అనేక గోస‌లు ప‌డుతున్నారు. ఆఖ‌రికి గ్రామ స‌ర్పంచుల‌ను కూడా చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయక ఈ కేసీఆర్ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో వారు గ్రామంలో కొత్త ప‌నులు చేపించలేక అనేక అవస్థలు ప‌డుతున్నారు. ముఖ్యంగా గ్రామానికి అవ‌స‌రమైన ముఖ్య‌మైన నిధుల‌ను కూడా విడుద‌ల చేయ‌డం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లుల కోసం స‌ర్పంచులు ధర్నాలు చేయాల్సిన ప‌రిస్థితిని కేసీఆర్ స‌ర్కార్ తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ప‌రిస్థితి లేదు. స్వరాష్ట్రంలో స‌ర్పంచులు ఇలా ఇబ్బందులు ప‌డుతారని ఎవ‌రూ కూడా ఊహించి ఉండ‌రు. కానీ ఈ కేసీఆర్ స‌ర్కార్ ఈ దౌర్భగ్య‌ ప‌రిస్థితిని తీసుకొచ్చింది. చివ‌ర‌కి స్మశానవాటికలు, పంచాయతీ బిల్స్, పల్లె ప్రకృతి వనాలు, CC రోడ్లు, మురుగు కాలువలకు సంబంధించిన బిల్లులు ఏడాదిన్నరగా పెండింగ్ లోనే ఉన్నాయి. కేసీఆర్ ఇప్ప‌టికైనా వారి పెండింగ్ బిల్లుల‌ను విడుదల చెయ్ నువ్వు ఓ ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలా చేయ‌డం ఎంత వ‌ర‌కు సమంజ‌సం. కేసీఆర్ ప్ర‌జల‌న్నీ గ‌మ‌నిస్తూనే ఉన్నారు. వారు నీకు త‌గిన గుణ‌పాఠం చెబుతారు.’’ అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు.

Updated Date - 2022-11-26T22:04:25+05:30 IST