Paritala Sunitha : సునీత దీక్ష భగ్నం.. లోబీపీ ఉండటంతో ఎమర్జెన్సీ వార్డుకు షిఫ్ట్ చేసిన వైద్యులు

ABN , First Publish Date - 2023-09-26T10:16:10+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె దీక్షను నేడు పోలీసులు భగ్నం చేశారు.

Paritala Sunitha : సునీత దీక్ష భగ్నం.. లోబీపీ ఉండటంతో ఎమర్జెన్సీ వార్డుకు షిఫ్ట్ చేసిన వైద్యులు

అనంతపురం : టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె దీక్షను నేడు పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేట వద్ద దీక్ష శిబిరం వద్దకు వెళ్లి బలవంతంగా పరిటాల సునీతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే సునీత, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై సునీత మండిపడ్డారు. అనంతరం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే సునీతకు లోబీపీ ఉన్నట్టుగా నిర్ధారణ కావడంతో వెంటనే ఆమెను వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పరిటాల అభిమానులు, టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-09-26T10:16:10+05:30 IST