YCP: వైసీపీకి మరో షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పనున్న ఎమ్మెల్సీ..
ABN , Publish Date - Dec 27 , 2023 | 12:24 PM
వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. పార్టీకి ఎమ్మెల్సీ వంశీకకృష్ణ యాదవ్ గుడ్ బై చెప్పనున్నారు. నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వంశీ జనసేన జెండా కప్పుకోనున్నారు.

అమరావతి: వైసీపీకి మరో గట్టి షాక్ తగిలింది. పార్టీకి ఎమ్మెల్సీ వంశీకకృష్ణ యాదవ్ గుడ్ బై చెప్పనున్నారు. నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వంశీ జనసేన జెండా కప్పుకోనున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీ మారే అవకాశం ఉన్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.ఆయనను బుజ్జగించేందుకు విశాఖపట్నం నగర పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు రంగంలోకి దిగారు. నగర పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు ప్రయత్నాలు విఫలం అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని.. వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్సీ వంశీకృష్ణ తెలిపారు. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తానని సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఆడియో ఒకటి విడుదల చేశారు. పార్టీ మారే ఆలోచనలో మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.