Botsa and Peddireddy : విద్యుత్ ఉద్యోగుల సమ్మె.. సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి | Botsa and Peddireddy went to CM camp office PVCH

Botsa and Peddireddy : విద్యుత్ ఉద్యోగుల సమ్మె.. సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2023-08-09T13:54:55+05:30 IST

సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి చేరుకున్నారు. అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యం లో సీఎం తో చర్చించే అవకాశం ఉంది.

Botsa and Peddireddy : విద్యుత్ ఉద్యోగుల సమ్మె.. సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి

అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి చేరుకున్నారు. అర్థరాత్రి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేపథ్యం లో సీఎం తో చర్చించే అవకాశం ఉంది. అంతకు ముందే ఈ అంశంపై మంత్రులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్చించారు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో చర్చించి సమ్మె వాయిదా వేసుకోవాలని ఎండీ విజయానంద్ కోరగా.. జేఏసీ నేతలు ససేమిరా అన్నారు. దీంతో హడావిడిగా మంత్రులు, అధికారులు మధ్య సీఎం క్యాంప్ కార్యాలయంలో చర్చ జరగనుంది. ఈ భేటీ అనంతరం దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మంత్రులు.. సీఎం జగన్ ముందు ఉంచనున్నట్టు తెలుస్తోంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-08-09T13:54:55+05:30 IST