JAGAN: సీఎం జగన్‌ను కలిసిన కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌.. ఇనార్బిట్‌ మాల్‌ శంకుస్ధాపనకు ఆహ్వానం

ABN , First Publish Date - 2023-07-18T22:11:56+05:30 IST

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డితో (CM YS Jaganmohan Reddy) కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా (K Raheja Group President Neel Raheja) సమావేశమయ్యారు.

JAGAN: సీఎం జగన్‌ను కలిసిన కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌.. ఇనార్బిట్‌ మాల్‌ శంకుస్ధాపనకు ఆహ్వానం

అమరావతి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డితో (CM YS Jaganmohan Reddy) కె రహేజా గ్రూపు ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా (K Raheja Group President Neel Raheja) సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఇనార్బిట్‌ మాల్స్‌ సీఈఓ రజనీష్‌ మహాజన్, కె రహేజా గ్రూప్‌ ఆంధ్రా, తెలంగాణా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోనె శ్రావణ్‌ కుమార్‌ హాజరయ్యారు.

విశాఖపట్నంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌ను కె రహేజా గ్రూపు ప్రతినిధులు ఆహ్వానించారు. విశాఖలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం చేపడుతున్నారు. కె రహేజా గ్రూప్‌ మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-07-18T22:12:07+05:30 IST