Share News

న్యాయమే నెగ్గింది

ABN , First Publish Date - 2023-11-21T00:31:34+05:30 IST

స్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్‌ బె యిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సోమవారం టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపాయి. చివరకు న్యాయమే నెగ్గింది. అన్యాయం ఓడింది అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశాయి.

న్యాయమే నెగ్గింది
జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణుల సంబరాలు

  • -స్కిల్‌ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌తో జిల్లా టీడీపీలో సంబరాలు

  • -స్వీట్లు పంచి బాణాసంచా పేల్చి వేడుకలు జరిపిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

  • -న్యాయం నెగ్గింది అంటూ నినాదాలు: చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు

  • -హైకోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అన్న నియోజకవర్గ ఇన్‌ఛార్జులు

  • -వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారంటూ నినాదాలు

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

స్కిల్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్‌ బె యిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా సోమవారం టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపాయి. చివరకు న్యాయమే నెగ్గింది. అన్యాయం ఓడింది అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశాయి. తాను ఏ తప్పు చేయ లేదని మొదటినుంచీ చెబుతున్న చంద్రబాబు మాటలే నిజమయ్యాయ ని పార్టీ నేతలు, కార్యకర్తలు గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం దుర్బుద్ధితో అన్యాయంగా చంద్రబాబును జైలుకు పంపి అవినీతి మచ్చ వేయాలను కుని చేసిన పన్నాగం బద్దలైందని పార్టీ నేతలు ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో త్వరలో చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వచ్చి గర్జి స్తార న్నారు. జగన్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజల్లో బట్టబయలు చేస్తారని వివరిం చారు. కాగా బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో పెద్దాపు రం ఎమ్మెల్యే రాజప్ప సంబరాలు జరిపారు. చంద్రబాబును అన్యాయం గా జైల్లో ఉంచాలను కున్న వైసీపీ ప్రభుత్వం కుట్రలు బద్ధల య్యాయ న్నారు. ఎన్నికల వరకు చంద్రబాబును జైల్లో ఉంచాలనే పన్నాగంతో ఆ పార్టీ వ్యవస్థలను కూడా మేనేజ్‌ చేసిం దని, చివరకు హైకోర్టు తీర్పుతో అవన్నీ పటాపంచలయ్యాయని పేర్కొ న్నారు. త్వరలో సుప్రీంకోర్టులోను చంద్రబాబుకు సంబంధించి స్కిల్‌ కేసు క్వాష్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగ్గంపేటలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యం లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభి మానులు సంబరాలు జరిపారు. స్వీట్లు తినిపించుకుని, బాణా సంచా పేల్చారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని నెహ్రూ అన్నారు. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో ప ట్టణంలో సంబరాలు జరిపారు. భారీగా వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. అనంత రం ఒకరికొకరు స్వీట్లు పంచు కున్నారు. అనంతరం టపాసు లు, బాణాసంచా పేల్చారు. చంద్రబాబు చిత్రపటానికి పా లాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ చంద్రబాబుపై అవినీతి మచ్చవేయాలని చూసిన జగన్‌ హైకోర్టు తీర్పుతో అభాసు పాలయ్యా రని ఽధ్వజమెత్తారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు జిల్లా పార్టీ కార్యాలయంవద్ద సంబరాలు జరిపాయి. పసుపు రంగు బాణాసంచా కాల్చి పెద్దఎత్తున నినాదాలు చేశారు. జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాల సుంకర పావని ఆధ్వర్యంలో కాకినాడలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రత్తి పాడు నియోజక వర్గ టీడీపీ ఇన్‌ఛార్జి వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో శంఖవరం మం డలం కత్తిపూడిలో స్వీట్లు పంచారు. తునిలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచి జై చంద్రబాబు నినాదాలు చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ మాట్లాడు తూ చంద్రబాబును ఇరికించడం కోసం వైసీపీ ఎంత అధికార దుర్విని యోగం చేసినా న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్‌లో పార్టీ నేతలు చంద్రబాబుకు రెగ్యులర్‌ బెయిల్‌ రావడంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారన్నారు.

న్యాయానికి సంకెళ్లు వీడాయి.. అధర్మం బంధింపబడింది: జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట టీడీపీ ఇన్‌చార్జి

జగ్గంపేట, నవంబరు 20: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులన్నీ నిరాధారమైనవని నిరూపణ అయింది. దేశానికి, రాష్ట్రానికి కావాల్సిన నేత చంద్రబాబును రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కలిసి అక్రమ కేసుల్లో నిర్భంధించారు. ఈ రోజు న్యాయం గెలిచి అధర్మం బంధింపబడింది. దానికి నిదర్శనం సాక్షాత్తూ న్యాయమూర్తి ఈ కేసులపై ఆధారాలు లేవనడం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఇదే జగన్‌రెడ్డి అవినీతి కేసులో 16నెలలు జైలు శిక్ష తర్వాత మధ్యంతర బెయిల్‌ తెచ్చుకున్నప్పుడు న్యాయమూర్తి కేసులపై వ్యాఖ్యానించకపోవడం వ్యత్యాసాన్ని గమనించండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రభుత్వానికి సలహాదారుడిగా కాకుండా ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడు.

రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరుపట్ల చినరాజప్ప హర్షం: నిమ్మకాయల చినరాజప్ప, పెద్దాపురం ఎమ్మెల్యే

సామర్లకోట, నవంబరు 20: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్రవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే స్కిల్‌ స్కాం పేరిట ఒక ఫాల్స్‌ కేసు బనాయించి తప్పుడు చర్యలతో అక్రమంగా అరెస్ట్‌ చేయించా రు. హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయడంతో న్యాయం గెలిచింది. పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును 60రోజులపాటు జైలులో పెట్టినా కోర్టులు న్యాయమైన తీర్పునివ్వడంతో బెయిల్‌పై బయటకు వచ్చారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబును బయట తిరగకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా న్యాయం చంద్రబాబు వైపే ఉంది. ఇప్పటివరకూ ఒక్క ఆధారం కూడా కోర్టుకు సమర్పించలేకపోయారు.

Updated Date - 2023-11-21T00:31:36+05:30 IST