Ayyannapatrudu: బీసీలకు ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు.. నట్టేట ముంచింది జగన్
ABN , First Publish Date - 2023-12-13T16:47:38+05:30 IST
Andhrapradesh: బీసీ అయిన తనను 25 ఏళ్లకే ఎమ్మెల్యే చేసింది అన్న ఎన్టీఆర్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకి రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ అని అన్నారు.
అనకాపల్లి: బీసీ అయిన తనను 25 ఏళ్లకే ఎమ్మెల్యే చేసింది అన్న ఎన్టీఆర్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Former Minister Ayyannapatrudu) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకి రాజ్యాధికారం ఇచ్చింది టీడీపీ అని అన్నారు. సేవకులను ప్రజా ప్రతినిధులుగా మార్చింది తెలుగుదేశం అని చెప్పుకొచ్చారు. బీసీలకు ఆదరణ పథకం పెట్టింది చంద్రబాబు అని.. బీసీలను నట్టేట ముంచింది జగన్ అని విమర్శించారు. ఆదరణ పథకం రద్దు చేసింది జగన్ అని... చెత్త మీద పన్నువేసిన, చెత్త ముఖ్యమంత్రి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంగలపూడి అనిత మాట్లాడుతూ.. బీసీలకు గుర్తింపు వచ్చింది టీడీపీ వలనే అని చెప్పుకొచ్చారు. పాయకరావుపేటలో బీసీలు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ పాలనలో బీసీలు అణిచివేతకు గురయ్యారని అనిత వ్యాఖ్యలు చేశారు.