Ambati Rambabu Sensational Comments : వివాహ వ్యవస్థలో పవన్ విప్లవం.. పెళ్ళిళ్ళ విప్లవ వీరుడు...

ABN , First Publish Date - 2023-07-01T13:18:58+05:30 IST

విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబుకు జనసేనను వపన్ అమ్మాడా? అని ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసే అధికారంలోకి వస్తారా..? అని ఎద్దేవా చేశారు.

Ambati Rambabu Sensational Comments : వివాహ వ్యవస్థలో పవన్ విప్లవం.. పెళ్ళిళ్ళ విప్లవ వీరుడు...

గుంటూరు : విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే చంద్రబాబుకు జనసేనను వపన్ అమ్మాడా? అని ప్రశ్నించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పోటీ చేసే అధికారంలోకి వస్తారా..? అని ఎద్దేవా చేశారు. జగన్ పోవాలంటున్న పవన్ ఎవరు రావాలో చెప్పాలన్నారు. జగన్ పోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయి కాబట్టి జగన్ పోవాలన్న వాడే పోవాలని అంబటి అన్నారు.

చెప్పు తీసి చూపించడం పాలసీనా? లేదంటే సమస్యా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని తిట్టడం పాలసీనా..? అని నిలదీశారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ చీడ పురుగు అని విమర్శించారు. రష్యాతో ఉన్న సన్నిహిత సంబంధం దెబ్బతింటుంది అది చూసుకోవాలన్నారు. రాజకీయాలకు పనికిరాని వాడని.. మ్యాడ్ డాగ్.. పిచ్చికుక్క.. అంటూ పవన్‌ను అంబటి నోటికోచ్చినట్టు దూషించారు. పవన్ కల్యాణ్ ఒక అసాంఘిక శక్తి అని.. వివాహ వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చాడన్నారు. అసలు ఆయనలోనే తేడా ఉందని..పెళ్ళిళ్ళ విప్లవ వీరుడు అని పవన్‌ను అంబటి రాంబాబు విమర్శించారు.

Updated Date - 2023-07-01T13:18:58+05:30 IST