Ambati Rambabu: పవన్‌కల్యాణ్‌పై అంబటి రాంబాబు ఫైర్

ABN , First Publish Date - 2023-07-14T14:21:55+05:30 IST

పవన్ కళ్యాణ్‌కి యాత్రలు చేయడం అలవాటు. వారాహి అనే అమ్మవారిని వాహనంగా పెట్టుకోవడం సరికాదు. పవన్ కళ్యాణ్ వరాహి యాత్ర కాదు.. వారాహి యాత్ర చేస్తున్నాడన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గతంలో కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు.. ఇప్పుడు దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు. చెప్పుతీసుకొని కొడతా అని బూతులు మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడతారంట. పవన్ కళ్యాణ్ అంటే గాలి కళ్యాణ్.

Ambati Rambabu: పవన్‌కల్యాణ్‌పై అంబటి రాంబాబు ఫైర్

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై (Pawan Kalyan) మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) విరుచుకుపడ్డారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ జనసేనానిపై మండిపడ్డారు. ‘‘పవన్ కళ్యాణ్‌కి యాత్రలు చేయడం అలవాటు. వారాహి అనే అమ్మవారిని వాహనంగా పెట్టుకోవడం సరికాదు. పవన్ కళ్యాణ్ వరాహి యాత్ర కాదు.. వారాహి యాత్ర చేస్తున్నాడన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గతంలో కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు.. ఇప్పుడు దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టారు. చెప్పుతీసుకొని కొడతా అని బూతులు మాట్లాడిన పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడతారంట. పవన్ కళ్యాణ్ అంటే గాలి కళ్యాణ్. ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తిరగడం దుష్ట చతుష్టయం కుట్ర. కాపులను మచ్చిక చేసుకోవడానికే తిరుగుతున్నారు. వలంటరీ వ్యవస్థపై మిస్టర్ గాలి కళ్యాణ్‌నుకున్న అభ్యంతరం ఏంటి? మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పవన్‌ను ఆవహించి ఉంది. జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తే అర్హత పవన్ కళ్యాణ్‌కి లేదు. పవన్ ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డికి (CM Jagan) అడుగుదూరంలోకి కూడా రాలేవు. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నావ్.. ఎంత ట్యాక్స్ కడుతున్నవ్. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటో లైట్ బాయ్ కూడా చెబుతారు. పవన్ కళ్యాణ్ జీవితంలో ఎప్పటికి ఎమ్మెల్యే కాలేరు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయలేవు.’’ అని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-07-14T14:22:31+05:30 IST