వైసీపీ నేత కారు బీభత్సం..
ABN , First Publish Date - 2023-07-07T11:13:13+05:30 IST
గుంటూరు: మార్కెట్ సెంటర్ దగ్గర వైసీపీ నేత కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ అమ్మకం దారుడిని ఢీ కొట్టింది. దీంతో విక్రయదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు కారుపై దాడి చేశారు.

గుంటూరు: మార్కెట్ సెంటర్ దగ్గర వైసీపీ నేత (YCP Leader) కారు బీభత్సం (Car Wreck) సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ అమ్మకం దారుడిని ఢీ కొట్టింది. దీంతో విక్రయదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆగ్రహించిన స్థానికులు కారుపై దాడి చేశారు. కారులో ఉన్న యువకులు పరారయ్యారు. కారు అద్దాలపై ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరుతో పెద్ద పెద్ద స్టిక్కర్లు ఉన్నాయి. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆకుకూరలు తెల్లవారుజామున అమ్ముకునేందుకు గుంటూరు చుట్టుపక్కల ఉన్నవారు అర్ధరాత్రి సమయంలో మార్కెట్ సెంటర్ వద్ద మూటలు పెట్టుకుంటారు. ఈ క్రమంలో ఇద్దరు యువకలు మద్యం మత్తులో ర్యాష్‌గా డ్రైవింగ్ చేసి డివైడర్‌ను ఢీ కొట్టి.. అక్కడున్న ఇద్దరికి కారు తగిలింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా ఆ వ్యక్తిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. దీంతో అక్కడే ఉన్న స్థానిక వ్యాపారులు కారుపై దాడి చేయగా కారులో ఉన్న ఇద్దరు పరారయ్యారు. ఆ కారు గుంటూరు జిల్లా వైసీపీకి చెందిన యువనేత అధ్యక్షుడు హరికృష్ణా రెడ్డికి చెందిన కారుగా ప్రచారం జరుగుతోంది. అయితే అది హరికృష్ణారెడ్డికి చెందినదా? లేక మరో వైసీపీ నేతకు చెందిందా? అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కారును పీఎస్‌కు తరలించారు. అయితే కారు నడిపింది ఎవరు? అందులో ఉన్నది ఎవరు? అన్న సమాచారం బయటకు పొక్కకుండా చూస్తున్నారు. కారు వైసీపీ నేతకు చెందినది కాబట్టే పోలీసులు దాస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
