TDP: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో భారీగా చేరికలు
ABN , First Publish Date - 2023-04-12T18:16:11+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో ఆ పార్టీలో భారీగా చేరారు. వైసీపీ స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ, ఇతర ముఖ్యనేతలు టీడీపీలో చేరారు.

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో ఆ పార్టీలో భారీగా చేరారు. వైసీపీ స్టేట్ బీసీ సెల్ సెక్రటరీ, ఇతర ముఖ్యనేతలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde Ramamohan) నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. పిల్లలు ఎంత దూరమైనా పసుపుజెండాతో పరుగు పెడుతున్నారన్నారు. పిల్లలు కూడా జెండా పట్టారంటే ఇక టీడీపీ (TDP)కి తిరుగులేదన్నారు. ‘‘సైకో పోవాలి.. సైకిల్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. సైకో అయినా పోవాలి.. లేదంటే మనమైనా రాష్ట్రం వదిలి పోవాలి. మీ ఇంటి తలుపుకు అనైతికంగా వైసీపీ వాళ్లు స్టిక్కర్లు ఎలా వేస్తారు?... జనం నుంచి జీతాలు తీసుకుంటున్న వాలంటీర్లు స్టిక్కర్లు ఎలా వేస్తారు?... జగన్ మీ బిడ్డ కాదు.. ఓ క్యాన్సర్ గడ్డ. క్యాన్సర్ గడ్డ వస్తే ఆపరేషన్ చేసి తొలగించాల్సిందే. జగన్ (Jagan) పాలనలో ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి. ఒకాయనకు పెట్రోల్ బాధ, ఇంకో ఆయనకు లిక్కర్ బాధ. ప్రజలకు ఇచ్చేది రూ.10లు.. గుంజేది రూ.100లు. జగన్ మన భవిష్యత్ కాదు.. జగనే మా నమ్మకం కాదు. ఏపీకి పట్టిన దరిద్రం జగన్. ఓ ముస్లిం మహిళను భయపెట్టి గుండెపోటుతో చనిపోయేలా చేశారు?’’ అని ప్రశ్నించారు.