Somuveerraju: తిరుమలలో వసతి గదుల ధరల పెంపుపై సోమువీర్రాజు ఆగ్రహం

ABN , First Publish Date - 2023-01-07T15:12:49+05:30 IST

తిరుమలలో వసతుల విషయంలో ధరలు పెంచడమే ప్రభుత్వం పరమావధిగా మార్చుకుందని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు.

Somuveerraju: తిరుమలలో వసతి గదుల ధరల పెంపుపై సోమువీర్రాజు ఆగ్రహం

విజయవాడ: తిరుమలలో వసతుల విషయంలో ధరలు పెంచడమే ప్రభుత్వం (YCP Government) పరమావధిగా మార్చుకుందని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు (AP BJP Chief Somuveerraju) విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వసతి గదుల ధరలను మూడు రెట్లు పెంచడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తుందని తెలిపారు. సౌకర్యాలను మెరుగు పరిచామన్న సాకుతో ధరలు పెంచడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. భక్తులకు తిరుమల తిరుపతి పాలకమండలి (TTD) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కో గది రూ.150 నుంచి ఒకేసారి రూ.1700 పెంచారని... ఇది మద్యతరగతి, సామాన్య భక్తులకు ఇబ్బందికరమన్నారు. హిందూ దేవాలయాల్లో మాత్రమే ధరలు పెంచే ప్రభుత్వంగా వైసీపీ కనపడుతోందని మండిపడ్డారు. వెంటనే పెంచిన ధరలను నిలుపుదల చేయాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-01-07T15:12:50+05:30 IST