TDP Bandh: మైలవరంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-09-11T12:33:59+05:30 IST

జిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసన రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది.

TDP Bandh: మైలవరంలో ఉద్రిక్తత

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని మైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అరెస్ట్‌కు నిరసన రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు టీడీపీ (TDP) పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మైలవరం పట్టణంలో దుకాణాలను, స్కూళ్లను మూయించి వేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్, టీడీపీ నాయకులు సుభాని, బాలకృష్ణ, టీడీపీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తుంటే తమను అడ్డుకోవడం ఏంటని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. లంకా లితిష్, సుభాని, బాలకృష్ణలను బలవంతంగా అదుపులోకి తీసుకొన్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులతో మైలవరం ఎస్సై హరి ప్రసాద్ దురుసుగా ప్రవర్తించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-09-11T12:33:59+05:30 IST