Manchu Manoj: భూమా మౌనిక కొడుకుపై మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-03-06T19:32:28+05:30 IST
తన భార్య భూమా మౌనికరెడ్డి (Bhuma Mounika Reddy) రాజకీయాల్లో రావాలనుకుంటే తన సపోర్టు ఉంటుందని హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ప్రకటించారు.
తిరుమల: తన భార్య భూమా మౌనికరెడ్డి (Bhuma Mounika Reddy) రాజకీయాల్లో రావాలనుకుంటే తన సపోర్టు ఉంటుందని హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ప్రకటించారు. అయితే తాను మాత్రం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మనోజ్, మౌనిక దంపతులు సోమవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామి (Tirumala Venkateswara Swamy)ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. జీవితంలో ఏదైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమను ఓడిపోకూడదన్నారు. ఎప్పటికీ ప్రేమే గెలవాలన్నారు. తమ ప్రేమ గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత తన షూటింగ్ మొదలైందన్నారు. ఎక్కడ ఆగిపోయానో అక్కడి నుంచి తిరిగి మొదలుపెడుతున్నట్టు తెలిపారు.
రాజకీయాల్లో రాకపోయినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే కోరిక మాత్రం ఉందని, అదే తమను కలిపిందన్నారు. మౌనికరెడ్డి తనకు 12 ఏళ్లుగా తెలుసన్నారు. నాలుగేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్దానని, ఆ ఇబ్బందుల నుంచి మౌనిక బయటకు తీసుకువచ్చిందని తెలిపారు. శివుడి ఆజ్ఞతో పెద్దలందరూ కలిసి తమ పెళ్లి చేశారన్నారు. ‘కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు’ అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. మనోజ్‌తో పాటు మంచు లక్ష్మీప్రసన్న (Manchu Lakshmiprasanna) దంపతులు, తెలంగాణ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (Pilot Rohit Reddy) కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.